‘వినయ విధేయ రామ’కు మరో షాక్..

ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుని వసూల్ పరంగా పర్లేదు అనిపించుకున్న రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ షోస్ నిలిచిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 50 కోట్లు వసూల్ చేసింది. ఎంత డిజాస్టర్ అయినా కనీసం పదిరోజులైనా నడిపించడం మాములే.

కానీ ‘వినయ విధేయ రామ’ ప్రొద్దుటూరులో షోస్ ఆపేశారని వార్తలు  వస్తున్నాయి. ఫైనాన్స్ , లైసెన్సు పరిస్థితుల సమస్య వాళ్ళ ‘వినయ విధేయ రామ’  ప్రదర్శనలు ప్రొద్దుటూరు పట్టణంలో నిలిపివేయబడినది. ఈ చిత్రంను అక్కడ థర్డ్ పార్టీకి అమ్మడంతో వాళ్ళు పేమెంట్ నిలిపివేయడంతో లైసెన్స్ రద్దు చేసుకున్నారని అయితే దీనితో యువీ క్రియేషన్స్‌కి ఎటువంటి ప్రమేయం లేదని చెబుతున్నారు.

సో అలా ఈ సినిమాను అక్కడ ఆడించే పరిస్థితులు లేవని క్లారిటీ వచ్చింది. కడప జిల్లా అంత ఇదే పరిస్థితి తెలుస్తుంది. ‘వినయ విధేయ రామ’ తరువాత రిలీజ్ అయిన   ఎఫ్ 2 సూపర్ హిట్ అవ్వడంతో ఆక్యుపెన్సీ కొరత ఏర్పడింది. ఇటువంటి న్యూస్ లు ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది.

Mega Fans Shock with VVR Theaters

Big Shock to Vinaya Vidheya Rama
ram charan
vinaya vidheya rama
fans
shock
theaters