Advertisementt

వ‌ర్మ వ‌ద‌ల బొమ్మాళీ అంటున్నాడుగా..!

Sun 20th Jan 2019 01:32 AM
  వ‌ర్మ వ‌ద‌ల బొమ్మాళీ అంటున్నాడుగా..!
rgv targets chandrababu naidu వ‌ర్మ వ‌ద‌ల బొమ్మాళీ అంటున్నాడుగా..!
Advertisement
Ads by CJ

`వ‌ద‌ల బొమ్మాళీ.. వ‌ద‌లా..వ‌స్తా వ‌స్తా ..క‌సితో నిన్ను కాల్చుకుపోతా..`  ఈ డైలాగ్‌ని  రామ్‌గోపాల్‌వ‌ర్మ తూచా త‌ప్ప‌కుండా పాటిస్తున్న‌ట్టున్నాడు. ఎన్ని ఆటంకాలు వ‌చ్చినా..ఎంత మంది బెదిరించినా వ‌ద‌ల బొమ్మాలీ వ‌ద‌లా అంటూ `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` రూపంలో చంద్ర‌బాబు నాయుడుకు భారీ షాక్ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నాడు. తాజాగా విడుద‌ల చేసిన ఎన్టీఆర్ లుక్ టీజ‌రే ఇందుకు బ‌ల‌మైన నిద‌ర్శ‌నం.ఎన్టీఆరే దిగొచ్చాడా? అన్నంత‌గా ఎన్టీఆర్ పాత్ర‌ధారిని ప‌ట్టుకోవ‌డం వ‌ర్మ‌కే చెల్లింది. శుక్ర‌వారం వ‌ర్మ వ‌దిలిన టీజ‌ర్‌లో అన్న ఎన్టీఆర్ లుక్‌ను చూసిన వాళ్లంతా ఔరా అంటూ నోరెళ్ల‌బెట్టారు. అంత ప‌ర్‌ఫెక్ట్ ప‌ర్స‌నాలిటీని ఎన్టీఆర్ పాత్ర‌కు సెట్ చేశాడు వ‌ర్మ‌.

శుక్ర‌వారం సాయంత్రం ఎన్టీఆర్ వ‌ర్థంతి సంద‌ర్భంగా వ‌దిలిన వీడియోలో కేవ‌లం మాట‌లు లేకుండా ఎన్టీఆర్ లుక్‌ను మాత్ర‌మే రివీల్ చేసిన వ‌ర్మ వెన్నుపోటు ద్వారా చంప‌బ‌డ్డ ఎన్టీఆర్ తిరిగి మా `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ద్వారా తిరిగివ‌స్తే ఎలా వుంటుందో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించ‌బోతున్నాం` అని వ‌ర్మ ఇస్టున్న హింట్ టీడీపీ శ్రేణుల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఎన్టీఆర్‌ని గ‌ద్దెదింప‌డానికి ముందు ఏం జ‌రిగింది?. దానికి ముందు కుదిరిన ఒప్పందం ఏమిటి?. ఇందులో వున్న కుట్ర‌కోణం ఎంత‌? ఎవ‌రెవ‌రు ఇందులో పాల్గొన్నారు? ఎవ‌రు ఎక్కువగా ఎన్టీఆర్‌కు వెన్ను పోటు పొడ‌వ‌డానికి స‌హ‌క‌రించార‌న్న విష‌యాల్ని ప్ర‌ధానంగా చ‌ర్చిస్తూ `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`ని వ‌ర్మ డిజైన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. `ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు` విడుద‌ల‌కు ముస్తాబ‌వుతున్న వేళ దానికి పోటీగా వ‌ర్మ త‌న `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`ని వ‌ద‌ల‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. వ‌ర్మ దాడిని టీడీపీ శ్రేణులు ఎలా త‌ట్టుకుంటాయో వేచి చూడాలి.

rgv targets chandrababu naidu:

rgv targets tdp leader

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ