Advertisementt

అనిల్ రావిపూడి ప్లానింగ్ అదుర్స్‌!

Sat 19th Jan 2019 10:36 AM
anil aravipudi,f2,mahesh,mahesh babu,venkatesh,varun tej,dil raju,  అనిల్ రావిపూడి ప్లానింగ్ అదుర్స్‌!
anil ravipudi to direct mahesh అనిల్ రావిపూడి ప్లానింగ్ అదుర్స్‌!
Advertisement
Ads by CJ

క‌ల్యాణ్‌రామ్‌కు క‌ష్ట‌కాలంలో `ప‌టాస్‌` లాంటి హిట్‌ని అందించిన యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ఆ త‌రువాత వ‌రుస‌గా దిల్ రాజు కాంపౌండ్‌లో సుప్రీమ్‌, రాజా ది గ్రేట్ వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి వ‌రుస హిట్‌ల‌ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా రెండు భారీ చిత్రాలు బాల‌కృష్ణ `ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు`, రామ్‌చ‌ర‌ణ్ `విన‌య విధేయ రామ‌` చిత్రాల‌తో సంక్రాంతి పోటీకి త‌న `ఎఫ్‌2` చిత్రాన్ని దింపి ఊహించ‌ని ఫ‌లితాన్ని సొంతం చేసుకున్నాడు. విడుద‌ల వ‌ర‌కు ఎలాంటి అంచ‌నాలు లేని ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్లు సాధిస్తూ ఇప్ప‌టికే బ్రేక్ ఈవెన్‌ను సాధించేయ‌డం ట్రేడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

మొద‌టి నుంచి త‌న కామెడీ టైమింగ్‌నే న‌మ్ముకున్న అనిల్ రావిపూడి ఈ చిత్రానికి కూడా అదే సూత్రాన్ని వాడి సంక్రాంతి విజేత‌గా నిలిచాడు. ఈ సినిమా ఇచ్చిన స‌క్సెస్ ఊపులో వున్న అనిల్ త్వ‌ర‌లో ప్రిన్స్‌తో సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌ట‌. మ‌హేష్‌బాబు తెర‌పైన కంటే తెర వెనుక అంటే సెట్‌లో వేసే పంచ్‌లు మామూలుగా వుండ‌వ‌నేది ఇండ‌స్ట్రీలోని చాలా మంది చెప్పే మాట‌. ఆ టైమింగ్ కి అనిల్ రావిపూడి జ‌త‌క‌లిస్తే ఇంకే ముంది హిలేరియ‌స్ న‌వ్వులే. త్వ‌ర‌లో దాన్ని నిజం చేయాల‌ని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలిసింది. మ‌హేష్‌బాబు హీరోగా సీరియ‌స్ క‌థ‌తో హిలేరియ‌స్ పంచ్‌ల‌తో అనిల్ రావిపూడి ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు తాజా స‌మాచారం. 

ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ `మ‌హ‌ర్షి` చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇది చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. దీని త‌రువాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీమేక‌ర్స్ చిత్రం సెట్స్ పైకి రానుంది. అది పూర్త‌యిన త‌రువాతే అనిల్ రావిపూడి చిత్రాన్ని మ‌హేష్ తెర‌పైకి తెచ్చే అవ‌కాశం వుంద‌ని చెబుతున్నారు. 

anil ravipudi to direct mahesh:

anil ravipudi to direct prince

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ