Advertisementt

ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్ళిన సిద్ధార్థ్

Sun 20th Jan 2019 01:13 AM
shankar,indian 2,kamal haasan,siddharth  ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్ళిన సిద్ధార్థ్
Siddarth to play key role in Indian 2 ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్ళిన సిద్ధార్థ్
Advertisement
Ads by CJ

మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ను మొదలెట్టిన సిద్ధార్ధ్ అనంతరం శంకర్ దర్శకత్వంలో రూపొందిన బాయ్స్ చిత్రం ద్వారా కథానాయకుడిగా వేడితెరకు పరిచయమైన విషయం అందరికీ తెలిసిందే. బాయ్స్ తర్వాత నువ్వోస్తానంటే నేనోద్దంటానా, బొమ్మరిల్లు లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో సిద్ధార్థ్ టాలీవుడ్ ను కొన్నాళ్లపాటు మకుటం లేని మహారాజులా ఏలాడు. ఆ తర్వాత చేసిన కొన్ని ప్రయోగాలు, తప్పుడు నిర్ణయాల కారణంగా మనోడి కెరీర్ కి గండిపడి ఆఖరికి క్యారెక్టర్ రోల్స్ కూడా చేశాడనుకోండి. ప్రస్తుతం మనోడు కేవలం తమిళ చిత్రాలకు మాత్రమే పరిమితమయ్యాడు. బయట నిర్మాతలెవరూ సిద్ధార్థ్ తో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపకపోవడంతో.. తన సినిమాలను తానే నిర్మించుకుంటూ ఏడాదికి ఒక సినిమా చేస్తూ తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నాడు. 

అయితే.. చాన్నాళ్ల తర్వాత సిద్ధార్థ్ కి ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా శంకర్ లాంటి దర్శకుడి నుంచి. సిద్ధార్థ్ ను హీరోగా పరిచయం చేసిన శంకర్ మనోడికి సెకండ్ ఛాన్స్ కూడా ఇవ్వాలని ఫిక్స్ అయినట్లున్నాడు. తాను కమల్ హాసన్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఇండియన్ 2లో సిద్ధార్డ్ కు అవకాశం ఇచ్చాడు శంకర్. ఆల్రెడీ లుక్ టెస్ట్ కూడా పూర్తయ్యిందట. త్వరలోనే సిద్ధార్ధ్ షూటింగ్ లో పాల్గొంటాడని వినికిడి. 

ఇకపోతే.. అనగనగా ఒక మగధీరుడు అనే సినిమాలో శ్రుతిహాసన్ తో కలిసి నటించిన సిద్ధార్థ్ కొన్నాళ్లపాటు ఆమెతో రిలేషన్ షిప్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆ విషయమై కమల్ హాసన్ సీరియస్ కూడా అయ్యాడు. మరి ఆ విషయాన్ని మర్చిపోయి ఇద్దరూ స్నేహంగా మెలుగుతారో లేదో చూడాలి. 

Siddarth to play key role in Indian 2:

Shankar Casted Siddharth for Indian 2 to play Beside Kamal haasan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ