Advertisementt

కాంపౌండ్ వదలకుండా దిల్ రాజు లాకేస్తున్నాడా?

Sat 19th Jan 2019 11:07 AM
dil raju,anil ravipudi,f2 movie,lock,dil raju movies  కాంపౌండ్ వదలకుండా దిల్ రాజు లాకేస్తున్నాడా?
Again Dil Raju Locked This Hit Director కాంపౌండ్ వదలకుండా దిల్ రాజు లాకేస్తున్నాడా?
Advertisement
Ads by CJ

గత ఏడాది భారీ ప్లాప్స్ ని చవి చూసిన దిల్ రాజు ఈసారి ఈ ఏడాది ప్రారంభంలోనే అనిల్ రావిపూడి పుణ్యమా అని బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. దిల్ రాజు మీడియం బడ్జెట్ తో నిర్మించిన ఎఫ్ టు ఈ సంక్రాతి సినిమాల జాబితాలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అనిల్ రావిపూడి కథ లేకపోయినా... కామెడీ తోనే హిట్ కొట్టించాడు. ఎఫ్ టు సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవడంతో ఈ సంక్రాంతికి ఎఫ్ టు సినిమా బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. అనిల్ రావిపూడి రాసిన కామెడీ డైలాగ్స్ కి వెంకీ కామెడీ టైమింగ్ తోడవడంతో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

అయితే అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమాలన్నీ వరస హిట్స్ అవడం.. అందులో దిల్ రాజు మూడు సినిమాలు నిర్మించడం.. అనిల్ తో తీసిన సినిమా లు హిట్ అవడంతో... దిల్ రాజు మళ్ళీ అనిల్ రావిపూడి తో సినిమా చెయ్యాలని అనుకోవడం.. అందుకే అనిల్ ని మళ్ళీ తన బ్యానర్ లోనే లాక్ చేసే ప్రయత్నాలు స్టార్ట్ చేసాడట. అయితే అనిల్ రావిపూడి తీసిన ఎఫ్ టు హిట్ అవడంతో.. ఇప్పుడు చాలామంది హీరోలతోపాటుగా... నిర్మాతలు కూడా అనిల్ రావిపూడి తో సినిమా చెయ్యాలని భావించడం... అనిల్ రావిపూడిని కలిసి అడ్వాన్స్ లు ఇచ్చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారట.

మరి దిల్ రాజు మాత్రం అనిల్ రావిపూడి ని మళ్ళీ లాక్ చేసి ఒక పెద్ద హీరోతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చెయ్యాలని చూస్తున్నాడట. అందుకే దిల్ రాజు, అనిల్ ని ఒక స్టార్ హీరోకి కమిట్ చేసే ప్రయత్నాలు మొదలు పెట్టాడట. మరి అనిల్ మాత్రం ప్రస్తుతం బయట బ్యానర్ లో సినిమా చెయ్యాలని చూస్తున్నాడట. అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమాలన్నీ వరస హాట్స్ అవడంతో... ఇప్పటికైనా పెద్ద హీరోల చూపు అనిల్ మీద పడుతుందేమో చూడాలి. ఒకవేళ అనిల్ తో ఎవరైనా స్టార్ హీరో సినిమా చేస్తే అనిల్ జాతకం మారడం ఖాయం. అయితే అనిల్ తో పెద్ద హీరో సినిమా చెయ్యాలంటే అది దిల్ రాజు వల్లే అవుతుంది. చూద్దాం అనిల్, దిల్ రాజుని వదిలించుకుంటాడా లేదా అనేది.

Again Dil Raju Locked This Hit Director:

Dil Raju Locked Anil Ravipudi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ