Advertisementt

అభిమాని కుటుంబానికి అండ‌గా యంగ్ హీరో

Sat 19th Jan 2019 08:25 AM
sundeep kishan,kadapa sreenu,fan,fans association,andhra pradesh,help  అభిమాని కుటుంబానికి అండ‌గా యంగ్ హీరో
Sundeep Kishan mourns beloved fan’s death అభిమాని కుటుంబానికి అండ‌గా యంగ్ హీరో
Advertisement
Ads by CJ

అభిమాని కుటుంబానికి అండ‌గా నిల‌బడ్డ‌ హీరో సందీప్ కిష‌న్ 

అభిమానానికి ఎల్ల‌లు ఉండ‌వు. అందుక‌నే హీరోలు అభిమానుల ప‌ట్ల ఆద‌ర‌ణ‌ను చూపుతూనే ఉంటారు. యువ క‌థానాయ‌కుడు సందీప్‌కిష‌న్ తొలి చిత్రం ‘ప్ర‌స్థానం’ నుండి అభిమాని అయిన క‌డ‌ప శ్రీను ఈరోజు ప్రొద్దుటూరులో గుండెపోటుతో క‌న్నుమూశారు. ఈ విష‌యం తెలుసుకున్న సందీప్ కిష‌న్ క‌డ‌ప శ్రీను ద‌హ‌న సంస్కారాల‌కైయ్యే డ‌బ్బులు ఇచ్చారు. అంతే కాకుండా ఆయ‌న త‌ల్లికి నెల‌కు ఏడువేల రూపాయ‌ల ఆర్ధిక సాయాన్ని అందించ‌నున్న‌ట్లు తెలియ‌జేశారు.

‘‘నాకు అన్ని సంద‌ర్భాల్లో అండ‌గా నిల‌బడ్డ నా అభిమాని, నా తొలి అభిమానిని కోల్పోవ‌డం బాధాక‌రం. చిన్న వ‌య‌సులోనే నా సోద‌రుడు దూరం కావ‌డం బాధాక‌రం. నీ కుటుంబానికి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను శ్రీను. నీ కుటుంబ బాధ్య‌త నాది. ల‌వ్ యు శ్రీను.. నీ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలి’’ అంటూ హీరో సందీప్ కిష‌న్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా సంతాపాన్ని ప్ర‌క‌టించారు.

Sundeep Kishan mourns beloved fan’s death:

Sundeep Kishan has expressed shock over the death of Kadapa Sreenu, President of the actor’s Fans Association in Andhra Pradesh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ