Advertisementt

కీర్తి సురేష్ బంపరాఫర్ కొట్టినట్లే..!

Sat 19th Jan 2019 08:23 AM
keerthi suresh,rajinikanth,ar murugadoss,keerthi suresh bumper offer,rrr  కీర్తి సురేష్ బంపరాఫర్ కొట్టినట్లే..!
Keerthi Suresh gets Bumper Offer కీర్తి సురేష్ బంపరాఫర్ కొట్టినట్లే..!
Advertisement
Ads by CJ

హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీ అయిపోయింది. భాషతో సంబంధం లేకుండా ఏ భాషలో పడితే ఆ భాషలో సినిమాలు చేస్తుంది. తమిళంతోపాటు తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కీర్తి ‘మహానటి’ సినిమాతో అన్ని రంగాల సినిమా వారికి తెలిసిపోయింది. రీసెంట్ గా ఆమె ఓ బంపర్ ఆఫర్ కొట్టేసిందని వార్తలు వస్తున్నాయి.

‘పేట’ లాంటి డీసెంట్ హిట్ తరువాత రజిని ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వస్తుంది. కొన్ని నెలల కిందట ఏఆర్ మురుగదాస్.. రజినీకి ఈ సినిమా స్టోరీ చెబితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది.

ఇది ఇలా ఉండగా కీర్తి సురేష్ ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమాలో నటిస్తుంది. అలానే తెలుగులో ఓ సినిమా చేయడానికి రీసెంట్ గా సైన్ కూడా చేసింది. ఇక రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న RRR లో కూడా కీర్తిని ఓ హీరోయిన్ గా తీసుకుందాం అని అనుకుంటున్నారు. ‘సర్కార్’ సినిమా తరువాత కీర్తి.. మరోసారి మురుగదాస్‌ డైరెక్షన్ లో నటిస్తుంది. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సిఉంది.

Keerthi Suresh gets Bumper Offer:

Keerthi Suresh in AR Murugadoss and Rajinikanth Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ