Advertisementt

చిరంజీవిని మోసం చేసిన బోయపాటి

Fri 18th Jan 2019 12:28 PM
chiranjeevi,boyapati srinu,vinaya vidheya rama  చిరంజీవిని మోసం చేసిన బోయపాటి
Boyapati Havent shown VVR Earlier to Chiru చిరంజీవిని మోసం చేసిన బోయపాటి
Advertisement
Ads by CJ

మెగా హీరోలలో ఏ ఒక్కరితో సినిమా చేయాలన్నా అయినా సరే మెగాస్టార్ చిరంజీవికి కథ-కథనం చెప్పి ఒప్పించడం అనేది గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీలోని అందరు దర్శకులు ఫాలో అవుతున్న రివాజు. అందుకు రాజమౌళి కూడా మినహాయింపు కాలేకపోయాడు. సినిమా మొదలెట్టడానికి ముందు కథ చెప్పడమే కాదు.. సినిమా పూర్తయ్యాక రిలీజ్ కి కనీసం రెండు నెలల ముందైనా మెగాస్టార్ కి సినిమా చూపించి ఆయన చెప్పిన ఫైనల్ ఛేంజస్ చేయాల్సిందే. సుకుమార్ కి కూడా ఈ పద్ధతి తప్పలేదు. కాకపోతే.. చిరంజీవి చెప్పిన చిన్న చిన్న మార్పుల వల్ల రంగస్థలం సూపర్ హిట్ అయ్యిందనుకోండి అది వేరే విషయం. అయితే.. చరణ్ తాజా చిత్రం వినయ విధేయ రామను మాత్రం బోయపాటి కనీసం వారం రోజుల ముందు కూడా చిరంజీవికి చూపించలేదట. అడిగినప్పుడల్లా కొన్ని యాక్షన్ సీన్స్ మాత్రమే చూపించేవాడట బోయపాటి. ఆ యాక్షన్ సీన్స్ చూసిన చిరంజీవి కూడా ఆ హింసను కాస్త టోన్ డౌన్ చేయమని కోరినప్పటికీ బోయపాటి మెగా రిక్వెస్ట్ ను పెద్దగా ఖాతరు చేయలేదు సరికదా.. పట్టించుకోలేదు కూడా. 

అయితే.. వినయ విధేయ రామ రిజల్ట్ అలా రావడానికి ముఖ్యకారణం చిరంజీవికి సినిమా చూపించకపోవడమే అని చెవులు కోరుక్కొంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కనీసం ఆయనకి చూపించి ఉంటే కొన్ని సీన్స్ ను ఎడిట్ అయినా చేయించేవాడు. అనవసరంగా బోయపాటి పుణ్యమా అని చరణ్ ను, అతడు చేసిన ఫైట్స్ ను ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా బోయపాటి మెగా ఫ్యామిలీ జీవితంలో మర్చిపోలేని ఫ్లాప్ ఇచ్చాడు. ఏదో చరణ్ క్రేజ్ పుణ్యమా అని కలెక్షన్స్ వస్తున్నాయి కానీ.. లేకపోతే 2019 బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిపోయేదీ చిత్రం. 

Boyapati Havent shown VVR Earlier to Chiru:

Chiranjeevi is furious on Boyapati that he didnt shown charan film earlier to him

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ