Advertisementt

అనసూయకు అంత సీన్ ఉందా?

Fri 18th Jan 2019 12:03 PM
anasuya,multi starrer  అనసూయకు అంత సీన్ ఉందా?
Did Anasuya Rejected that Project Wantedly అనసూయకు అంత సీన్ ఉందా?
Advertisement
Ads by CJ

అప్పట్లో అత్తారింటికి దారేది సినిమాలో ముంతాజ్ డ్యాన్స్ చేసిన స్పెషల్ సాంగ్ ఆఫర్ ను ముందు త్రివిక్రమ్ హాట్ యాంకర్ అనసూయకు ఆఫర్ చేయగా.. ఆమె రిజెక్ట్ చేసిందని టాక్ గట్టిగా వినిపించేది. ఈ విషయాన్ని అనసూయ కూడా కన్ఫర్మ్ చేసిందనుకోండి. ఆ సినిమాలో నటించినా రానంత క్రేజ్ ను ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసి దక్కించుకొంది అనసూయ. ఆ క్రేజ్ తోనే కొన్ని సినిమాలో స్పెషల్ రోల్స్, ఇంకొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసే అవకాశం అందిపుచ్చుకుంది. ఇక రంగస్థలం చిత్రంలో పోషించిన రంగమ్మత్త పాత్ర అయితే ఆమె కెరీర్ కు కీలకమైన మలుపుగా నిలిచింది. అప్పటివరకూ ఆమెకున్న క్రేజ్ ను డబుల్, త్రిబుల్ చేసింది రంగమ్మత్త పాత్ర. అప్పటికే చాలా తక్కువ సినిమాలు ఒప్పుకొంటున్న అనసూయ రంగస్థలం తర్వాత మరింత జాగ్రత్తగా వ్యవహరించడం మొదలెట్టింది. 

ఇటీవల ఎఫ్2 సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసిన అనసూయ.. తన పాత్ర నచ్చకపోవడంతో ఓ భారీ సినిమా ఆఫర్ ను వదులుకుందని ఇండస్ట్రీలో టాక్ రచ్చ చేస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి చేయనున్న ఈ అమేజింగ్ మల్టీస్టారర్ కోసం దర్శకుడు ఏకంగా ఆమె కోసం ఓ క్యారెక్టర్ క్రియేట్ చేయగా.. ఆ క్యారెక్టర్ వ్యవహార శైలి అంతగా నచ్చని అనసూయ చాలా సున్నితంగా ఆఫర్ ను తిరస్కరించిందని వినికిడి. 

ఈ విషయం తెలిసిన కొందరు అంత పెద్ద సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేసేంత సీన్ అనసూయకు ఉందా?, అత్తారింటికి దారేది తరహాలోనే ఈ ప్రొజెక్ట్ ను రిజెక్ట్ చేసిందనే పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరేలా మాట్లాడినా కూడా ప్రస్తుతం అనసూయకు ఉన్న క్రేజ్ కి అగ్ర దర్శకులు ఆమె కోసం పాత్రలు రాయడం కాదు, ఏకంగా ఆమెకోసం సినిమా తీసేలా ఉన్నారు. 

Did Anasuya Rejected that Project Wantedly:

Buzz is that Anasuya Rejected a Massive Multistarrer because she didnt liked the role

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ