విడుదలైన రోజు ప్రీమియర్స్ టాక్ మరియు రివ్యూస్ మరియు సోషల్ మీడియా బజ్ చూసినవాళ్ళందరూ సినిమా సూపర్ హిట్ అవ్వడమెంటీ, ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయిపోతుందని, తెలుగు సినిమా చరిత్రలో ఇది మరో మైలురాయి అనీ విశ్లేషణలు వెళ్లడయ్యాయి. దాంతో మళ్ళీ సంక్రాంతి విన్నర్ గా బాలయ్య నిలిచాడని, మరో సూపర్ హిట్ ఖాయమని నందమూరి అభిమానులు సంబరాలు చేసుకొనేలోపు ఫస్ట్ కలెక్షన్స్ 12 కోట్లు కూడా దాటలేదని తెలిసేసరికి షాక్ అయ్యారు. దాదాపు 60 కోట్ల రూపాయలకు అమ్మబడిన ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్ ఇప్పటివరకూ కనీసం 40 కోట్లు కూడా వసూలు చేయలేదు. దాంతో డిస్ట్రిబ్యూటర్స్ ఆల్రెడీ కొన్ని ఏరియాల్లో ఎన్టీఆర్ మహానాయకుడ్ని ఫ్రీగా ఇవ్వమని, ఇంకొందరు సగం ధరకు ఇవ్వమని కోరడం మొదలెట్టారు. ఈ సినిమాతో బాలయ్య 100 కోట్ల క్లబ్ లోకి వచ్చి చేరతాడని ఎక్స్ పెక్ట్ చేసిన దర్శకనిర్మాతలు కూడా అనీసం జైసింహా కలెక్షన్స్ కూడా క్రాస్ చేయడం కష్టమని ఫిక్సయిపోయి బాధపడిపోతున్నారు.
ఇకపోతే.. అందరూ బాగుంది అని అంటున్న సినిమాకి కలెక్షన్స్ ఎందుకు రావడం లేదా అని ఆలోచిస్తే.. మొట్టమొదటి కారణం అసలు ఎన్టీఆర్ లేదా బాలయ్య అభిమానులకే ఈ సినిమా మీద ఆసక్తి లేకపోవడం. అందుకు నిదర్శనం ప్రీమియర్ షో టికెట్స్ ను ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ థియేటర్ల దగ్గర ఫ్రీగా పంచారు. ఒక కొత్త సినిమాకి ప్రీమియర్ లేదా బెనిఫిట్ షో టికెట్స్ ఫ్రీగా పంచడం అనేది బహుశా బాలయ్య కెరీర్ లో ఇదే మొదటిసారి అనుకుంటా. రెండోది సినిమా మొత్తం ఎన్టీఆర్ జీవితం కంటే ఆయన సినిమాలే ఉండడం. మూడోది ఎన్టీఆర్ జీవితంలో చీకటి కోణాలు కూడా ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు కేవలం పాజిటివ్ పాయింట్స్ ను మాత్రమే చూపించడాన్ని చరిత్ర తెలిసినవాళ్ళకు రుచించలేదు. ఇక అన్నిటికీ మించి ఈ సినిమాకు రిపీటెడ్ ఆడియన్స్ లేరు. ఈ కారణాల వల్ల ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకి కలెక్షన్స్ రావడం లేదని అంచనా వేస్తున్నారు. మరి ఈ తప్పులను మలిభాగంలోనైనా సరిదిద్దుకుంటారో లేదో చూడాలి.