తెలుగు కుర్రాడైనా కూడా కోలీవుడ్‌లో మాస్, యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌స్టార్ విశాల్. కేవలం నటుడిగా మాత్రమే కాదు... తమిళ ఇండస్ట్రీలో పలువురి మద్దతు సాధించి, నిర్మాతల మండలికి, నడిగర్ సంఘానికి ఉన్నత పదవుల్లో ఉండి తన నిర్ణయాలతో బాగా ఆకట్టుకుంటున్నాడు. ప్రముఖ నిర్మాత, పారిశ్రామికవేత్త జి.కె. రెడ్డి తనయుడైన విశాల్ రెడ్డి జీవితం అంతా చెన్నైలోనే జరిగింది. తన చిన్ననాటి స్నేహితురాలు, శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్‌కుమార్‌తో ఎఫైర్ నడుపుతున్నాడని కూడా కోలీవుడ్ మీడయా కోడై కూసింది. ఇదే కారణం వల్ల ఆయన తన తండ్రికి, శరత్‌కుమార్‌కి కూడా బద్ద శత్రువుగా మారాడని అంటారు.
నాడు నడిగర్ సంఘం బిల్డింగ్, అందులో కళ్యాణమండపం కట్టిన తర్వాత అందులో జరగబోయే తొలి వివాహం తనదేనని ప్రకటించడంతో ఈ వార్తలు మరింతగా బలపడ్డాయి. కానీ ఇటీవల మాత్రం వీరిద్దరు తాము మంచి స్నేహితులమని అంతకు మించింది తమ మద్య ఏమీ లేదని ప్రకటించారు. విశాల్ చిత్రంలో వరలక్ష్మీశరత్‌కుమార్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను కూడా తాజాగా పోషించింది. ఇక ఇటీవల విశాల్ తాను హైదరాబాద్ అల్లుడిని కాబోతున్నానంటూ సంచలన ప్రకటన చేశాడు.
తాజాగా ఈ నల్లన్నయ్య తన కాబోయే శ్రీమతితో కలిసి దిగిన ఫోటోను విడుదల చేశాడు. దాంతో ఇది బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆయనకు కాబోయే భార్య పేరు ఏమిటంటే అనీషారెడ్డి. హైదరాబాద్‌కి చెందిన బిజినెస్‌మ్యాగ్నేట్ విజయ్‌రెడ్డి-పద్మజల ముద్దుల కూతురే అనీషారెడ్డి. పందెంకోడి2 చిత్రం తర్వాత విశాల్ టెంపర్ రీమేక్ అయోగిపై దృష్టి పెట్టాడు. ఈ చిత్రం పూర్తయి విడుదలయ్యే లోపు విశాల్ హైదరాబాదీ అల్లుడు కావడం కూడా ఖాయమైంది. ఇలాగైనా ఈ హీరో రాబోయే రోజుల్లో తెలుగువారికి మరింత సన్నిహితుడిగా మారుతాడేమో వేచిచూడాల్సివుంది...!