Advertisementt

నాని జెర్సీపై అప్పుడే విమర్శలు..!

Wed 16th Jan 2019 10:40 PM
nani,jersey,rumours,story  నాని జెర్సీపై అప్పుడే విమర్శలు..!
jersey in controversy నాని జెర్సీపై అప్పుడే విమర్శలు..!
Advertisement
Ads by CJ

ఎలాంటి బ్య్రాగ్రౌండ్‌ లేకుండా సినిమా రంగంలోకి దర్శకుడు కావాలని వచ్చిన నాని అష్టాచెమ్మా, పిల్లజమీందార్‌ వంటి చిత్రాలతో సత్తా చాటాడు. కానీ జెండాపై కపిరాజు, పైసా వంటి చిత్రాల సమయంలో ఆయన కెరీర్‌ తీవ్ర ప్రమాదంలో పడింది. కానీ ఎంతో కాన్ఫిడెంట్‌గా, దర్శకత్వంపై, కథలపై ఉన్న జడ్జిమెంట్‌తో ఆయన వెంటనే కొత్త దర్శకులు, నవతరం దర్శకుల సహాయంతో వరుస హిట్స్‌ కొట్టాడు. ఏకంగా నేచురల్‌స్టార్‌ స్థాయికి ఎదిగాడు. 

భలే భలే మగాడివోయ్‌, ఎంసీఏ, నిన్నుకోరి, కృష్ణగాడి వీరప్రేమగాథ, నేను లోకల్‌ ఇలా ఆయన విజయయాత్ర అప్రతిహతంగా సాగింది. నాని ఎంచుకునే సబ్జెక్ట్‌లు విజయవంతమైనవా? లేక ఆయన నటించిన చిత్రాలన్నీ విజయవంతం అవుతాయా? అనే సందేహాలు వచ్చే విధంగా ఆయన కెరీర్‌ కొనసాగింది. కానీ ఈ వరుస విజయాలకు కృష్ణార్జునయుద్దంతో బ్రేక్‌ పడింది. ఆ తర్వాత నాగార్జునతో చేసిన మల్టీస్టారర్‌ దేవదాస్‌ కూడా రొటీన్‌ అనే విమర్శలను ఎదుర్కొంది. దాంతో నాని కథల విషయంలో మరింత జాగ్రత్త వహిస్తూ ప్రస్తుతం గౌతమ్‌ దర్శకత్వంలో క్రికెట్‌ నేపధ్యంలో జెర్సీ అనే చిత్రం చేస్తున్నాడు. 

క్రీడల నుంచి రిటైర్‌ అయ్యే వయసులో ఆటపై మమకారం పెంచుకుని క్రికెటర్‌ కావాలనే కోరికతో నిరుత్సాహ పూరిత వాతావరణాన్ని కూడా ఎదిరించి నాని క్రికెటర్‌గా ఎలా ఎదిగాడు? అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోందని ఇటీవల విడుదలైన టీజర్‌ ద్వారా అర్దమైంది. ఈ టీజర్‌ చూసిన వారు ఈ సారి నాని మరో బ్లాక్‌బస్టర్‌ కొట్టి గాడిలో పడటం ఖాయమని అంటున్నారు. అదే సమయంలో సోషల్‌మీడియా విస్తారంగా వ్యాపించిన నేపధ్యంలో ఈ చిత్రం హాలీవుడ్‌ మూవీ అయిన ఇన్విన్సిబుల్‌కి స్ఫూర్తిగా తీసుకుని తీస్తున్నారనే ప్రచారం సాగింది. 

ఇన్విన్సిబుల్‌ ఇలాంటి లేట్‌ వయసు స్పోర్ట్స్‌మెన్‌ నేపధ్యంలోనే అయినా ఫుట్‌బాల్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. మన దేశంలో ఫుట్‌బాల్‌తో పాటు అన్ని క్రీడలకంటే క్రికెట్‌ని పిచ్చిగా, ఓ మతంగా కొలిచే పరిస్థితి ఉండటంతో జెర్సీకి నేపధ్యంగా క్రికెట్‌ని ఎంచుకున్నారని ప్రచారం జరుగుతోంది. స్ఫూర్తి పొందడం తప్పు కాదు గానీ దానిని మన నేటివిటీకి తగ్గట్లు ఎలా మార్పులు చేర్పులు చేశారో వేచిచూడాల్సివుంది.

jersey in controversy:

copy rumours on nani jersey story

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ