Advertisementt

ప్రభాస్‌కి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చింది

Wed 16th Jan 2019 10:38 PM
prabhas,shraddha kapoor,saaho,return gift  ప్రభాస్‌కి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చింది
shraddha kapoor gives return gift to pradhas ప్రభాస్‌కి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చింది
Advertisement
Ads by CJ

తెలుగులో అజాతశత్రువు, ఎవరినీ కించిత్తు కూడా బాధపెట్టని హీరో, సిగ్గరిగానే ఉంటూ ఎంతో ఫ్రెండ్లీగా మసలుకునే హీరోగా బాహుబలితో నేషనల్‌ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌కి పేరుంది. నేడు ఏ హీరోయిన్‌ని అడిగినా ప్రభాస్‌తో ఓ చిత్రం చేయాలని ఉందని ఘంటాపధంగా చెబుతూ ఉంటారు. ఇక ఈయన తన సహచరులని ఆప్యాయంతో క్లీన్‌బోల్డ్‌ కూడా సిద్దహస్తునిగా మారాడు. ఇక విషయానికి వస్తే బాలీవుడ్‌కి ఎంతో సుపరిచితురాలైన శ్రద్దాకపూర్‌ ప్రస్తుతం ప్రభాస్‌తో సాహో చిత్రంలో జంటగా నటిస్తోంది. తన ప్రవర్తనపై కాస్త విమర్శలు ఉన్నా కూడా ఈమె ప్రభాస్‌కి ఫ్లాట్‌ కావడమే కాదు.. ప్రభాస్‌ని కూడా ఫ్లాట్‌ చేసే పనిలో ఉంది.

సాహో చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అబుదాబితో పాటు రామోజీఫిలింసిటీలో ఇటీవల వరకు జరిగింది. ఈ చిత్రం షూటింగ్‌ సందర్భంగా శ్రద్దాకపూర్‌ పట్ల ప్రభాస్‌ ప్రత్యేక శ్రద్ద చూపాడు. దాంతో వారిద్దరు ఒక చిత్రం పూర్తి కాముందే ఒకరికొకరు ఎంతో ఇష్టులుగా తయారయ్యారు. ఇక్కడ షూటింగ్‌ జరిగినంత కాలం హైదరాబాద్‌కి చెందిన ప్రత్యేక వంటకాలను తన ఇంట్లో తయారు చేయించి మరీ ప్రభాస్‌ షూటింగ్‌లో శ్రద్దాకపూర్‌కి రుచి చూపిస్తూ వచ్చాడు. ప్రభాస్‌ తెప్పించిన ప్రత్యేక వంటకాలకు సంబంధించిన ఫొటోలను ఆ మద్య శ్రద్దాకపూర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఎంతో సంతోషంగా పంచుకుంది. 

ప్రస్తుతం ఆమె సంక్రాంతి కానుకగా తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకి వెళ్లింది. అంతేకాదు.. మరాఠీలకు ఎంతో సంప్రదాయమైన స్వీట్‌.. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు అందరు ఒకరినొకరు ఇచ్చి పుచ్చుకునే నువ్వుల లడ్డు అదేనండీ మరాఠీ భాషలో తిల్‌గుల్‌ లడ్డూగా పేరొందిన వాటిని డార్లింగ్‌కి, సాహో టీంకి ముంబై నుంచి మరీ ప్రత్యేకంగా పంపిందట. ఇలా ప్రభాస్‌కి ఆమె రిటర్న్‌గిఫ్ట్‌ ఇచ్చిందనే చెప్పాలి. ఇక తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లో కూడా రూపొందున్న సరికొత్త హాలీవుడ్‌ యాక్షన్‌థ్రిల్లర్‌కి ధీటుగా రూపొందుతున్న సాహో చిత్రం ఈ ఏడాది స్వాతంత్య్రదినోత్సవ కానుకగా అన్ని భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. 

మరి తెర వెనుక ఎంతో కుశలంగా మసలు కుంటున్న ప్రభాస్‌-శ్రద్దాకపూర్‌ల జోడీ వెండితెరపై కూడా మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ల ఉండటం ఖాయమని యూనిట్‌ సభ్యులు ఘంటాపధంగా చెబుతున్నారు. మొత్తానికి ప్రభాస్‌ క్లోజ్‌ ఫ్రెండ్స్‌ జాబితాలో అనుష్కతో పాటు శ్రద్దాకపూర్‌ కూడా చేరిందన్న మాట...! 

shraddha kapoor gives return gift to pradhas:

shraddha kapoor surprises prabhas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ