Advertisementt

దిల్ రాజు ఈజ్ సేఫ్

Wed 16th Jan 2019 10:33 PM
dil raju,f2,vinaya vidheya rama  దిల్ రాజు ఈజ్ సేఫ్
Dil Raju is back to form with two hits దిల్ రాజు ఈజ్ సేఫ్
Advertisement
Ads by CJ

ఈ సంక్రాంతికి చాలారోజుల తర్వాత సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్.. చాలా ఆశలు పెట్టుకొన్న "అంతరిక్షం" ఫ్లాపైన తర్వాత మంచి హిట్ కొట్టిన వరుణ్ తేజ్ ల కంటే ఈ సంక్రాంతికి చాలా హ్యాపీగా ఉన్న ఏకైక వ్యక్తి దిల్ రాజు. గతేడాది భారీ స్థాయిలో నష్టపోయిన దిల్ రాజు ఈ ఏడాది ప్రారంభంలోనే నిర్మాతగా మాత్రమే కాక డిస్ట్రిబ్యూటర్ గానూ సూపర్ హిట్స్ సొంతం చేసుకొన్నాడు. దిల్ రాజు నిర్మించిన ఎఫ్2 ఆల్రెడీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తుండగా.. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ నైజాం ఏరియాలో హౌస్ ఫుల్స్ తో నడుస్తోంది వినయ విధేయ రామ. ఈ రెండు సినిమాలు దిల్ రాజుకి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. సో, దిల్ రాజు ఆల్రెడీ సేఫ్ జోన్ లో ఉన్నట్లే.  

ఈ ఏడాది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొన్నాడు దిల్ రాజు. మహేష్ బాబుతో మహర్షి చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్ రాజు ఈ ఏడాది తనకు బాగా ఆచ్చొచ్చిన చిన్న సినిమాలపై దృష్టి సారించాడు. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీయడానికి రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ రెండు సినిమాలు ప్రొడక్షన్ లో ఉన్నాయి. 

చూస్తుంటే.. గతేడాది పోగొట్టుకున్న మొత్తాన్ని కూడా ఈ ఏడాది తిరిగి రాబట్టుకొనేలా ఉన్నాడు దిల్ రాజు. ఎక్కడ పోగొట్టుకొన్నదాన్ని అక్కడే సంపాదించుకోవడం అంటే ఇదేనేమో. దిల్ రాజు ఈ సక్సెస్ స్ట్రీక్ ను ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకొందాం. 

Dil Raju is back to form with two hits:

Dil Raju getting Huge Profits as a producer and distributor this year 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ