Advertisementt

ఆ హీరోహీరోయిన్ల పెళ్లి సెట్..!!

Wed 16th Jan 2019 10:29 PM
vishal,richa gangopadhyay,marriage  ఆ హీరోహీరోయిన్ల పెళ్లి సెట్..!!
Vishal and Richa Gangopadhyay Announced their Marriage ఆ హీరోహీరోయిన్ల పెళ్లి సెట్..!!
Advertisement
Ads by CJ

గతేడాది అత్యధిక పెళ్లిళ్లు జరిగిన ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది మన టాలీవుడ్డే. గతేడాది ఏకంగా 8 మంది హీరోహీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొన్నారు. ఈ ఏడాది ఆ రికార్డ్ బ్రేక్ చేసేందుకు మళ్ళీ మనోళ్ళు రెడీ అవుతున్నారు. నిన్న టాలీవుడ్ & కోలీవుడ్ హీరో విశాల్, టాలీవుడ్ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ తాము పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించడంతోపాటు తమ లైఫ్ పార్ట్నర్స్ ని కూడా ప్రపంచానికి పరిచయం చేశారు. 

హీరో విశాల్ త్వరలోనే అనీషా అనే నటిని పెళ్లాడనున్నాడు. ఆమె ఇదివరకు విజయ్ దేవరకొండ నటించిన "పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి" చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఇక "లీడర్" సినిమాతో హీరోయిన్ గా పరిచయమై ఆల్మోస్ట్ అందరు స్టార్ హీరోలతో నటించి "భాయ్" సినిమా తర్వాత సినిమాలకు దూరమైన రిచా గంగోపాధ్యాయ కూడా అమెరికాలో జోయ్ అనే వ్యక్తిని పెళ్లాడనున్నానని ప్రకటించింది. 

ఇలా ఈ ఇద్దరు హీరోహీరోయిన్లు ఒకేసారి తమ పెళ్లిని ఒకేసారి ప్రకటించడంతో వారి అభిమానులు అవాక్కయ్యారు. ఈ ఇద్దరివీ ప్రేమ పెళ్లిళ్లే కావడం విశేషం. ఇలా ఏడాది ప్రారంభంలోనే ఇద్దరు స్టార్ హీరోహీరోయిన్లు తమ పెళ్లి ప్రకటనలు చేయడంతో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు మరికొందరు కూడా పెళ్ళికి రెడీ అవుతున్నారు. గత కొన్నాళ్లుగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా మిగిలిపోయిన కుర్ర హీరోలు కూడా ఈ ఏడాది పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతారేమో చూడాలి. 

Vishal and Richa Gangopadhyay Announced their Marriage:

Actor Vishan & Actress Richa Gangopadhyay Announced their Respective Marriages 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ