యువతరం హీరోల్లో మోస్ట్ లక్కీయస్ట్ ఎట్ ది సేమ్ మోస్ట్ అన్ లక్కీ హీరో ఎవరు అని అడిగితే ఇమ్మీడియట్ గా ఇండస్ట్రీ వర్గాలు మాత్రమే కాదు సగటు ప్రేక్షకులు కూడా టక్కున చెప్పే సమాధానం అఖిల్ అక్కినేని. అక్కినేని వంశం మూడో తరం కథానాయకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్ బాబుకు ఎందుకో అదృష్టం కలిసిరాక పరిచయ చిత్రం "అఖిల్"తో ఆల్ టైమ్ డిజాస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత యాక్షన్ ను కాస్త తగ్గించి హలో అని ఆడియన్స్ ను పలకరించినా వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మూడో సినిమా మిస్టర్ మజ్ను ఈనెల 25న విడుదలకు సిద్ధంగా ఉంది. పాటలు ఆల్రెడీ రిలీజై శ్రోతలను ఓ మేరకు ఆకట్టుకున్నాయి. సినిమా పి.ఆర్ టీం నుంచి ఇండస్ట్రీకి చెందిన డిజిటల్ మీడియా టీమ్స్ అన్నిటినీ ఒకచోటికి చేర్చి సినిమాను భీభత్సంగా ప్రమోట్ చేస్తున్నప్పటికీ ఎందుకో సరైన బజ్ క్రియేట్ అవ్వడం లేదు. మొన్నటివరకూ సంక్రాంతి సినిమాల వల్ల తమ చిత్రాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదని సరిపెట్టుకున్న మిస్టర్ మజ్ను టీం.. సినిమాల జోరుతోపాటు పండగ వేడి కూడా తగ్గినప్పటికీ.. సినిమా మీద జనాలు పెద్దగా దృష్టి సారించకపోవడం పట్ల అసంతృప్తిగానూ, భయంగానూ ఉన్నారు.
తొలిప్రేమ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరీ తెరకెక్కించిన సినిమా అయినప్పటికీ ఈ సినిమా మీద అఖిల్ మార్క్ పడడం మైనస్ అయ్యింది. తమన్ మ్యూజికల్ ఆల్బమ్ కూడా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేయాలకపోవడంతో జనవరి 25న విడుదలవుతున్న ఈ సినిమాకి ప్రారంభ వసూళ్లు పెద్దగా వచ్చే అవకాశమైతే కనిపించడం లేదు. సొ, సినిమా రిలీజయ్యాక రివ్యూస్ తోపాటు మౌత్ టాక్ కూడా బలంగా ఉంటే తప్ప సినిమా హిట్ అవ్వడం కానీ నిర్మాతకు కాసిన్ని లాభాలు తెచ్చిపెట్టడం కానీ కష్టమే. ఈ వ్యవహారాన్నంతా గమనిస్తున్న మాస్టర్ మైండ్ నాగార్జునకు కూడా అఖిల్ విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతుందో అర్ధం కావడం లేదట. మిస్టర్ మజ్ను రిజల్ట్ మీద అఖిల్ కెరీర్ ఏమీ ఆధారపడి లేదు ఎందుకంటే.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో కొడుకుతో వరుసబెట్టి 25 సినిమాలు తీయగల సత్తా ఉన్న నిర్మాత నాగార్జున. కానీ.. అఖిల్ హీరోగా నిలబడాలంటే మాత్రం తప్పకుండా మిస్టర్ మజ్ను కమర్షియల్ గా హిట్ అవ్వాల్సిందే.