Advertisementt

చైతు కూడా బ్యాట్‌ పట్టాడు

Wed 16th Jan 2019 07:50 PM
naga chaitanya,samantha,majili,new poster  చైతు కూడా బ్యాట్‌ పట్టాడు
chaitu, sam, new look from majili చైతు కూడా బ్యాట్‌ పట్టాడు
Advertisement
Ads by CJ

మనకి తెలిసినంత వరకు తెలుగులో వచ్చిన అశ్వనీ చిత్రం పూర్తిగా పరుగుల రాణి అశ్వనీనాచప్ప జీవితంపై వచ్చిన బయోపిక్‌. స్వయంగా అశ్వనీనాచప్పే నటించిన ఈ చిత్రాన్ని రామోజీరావు నిర్మించగా మౌళి దర్శకత్వం వహించాడు. ఇందులో కీలకపాత్రలో భానుచందర్‌ నటించాడు. అయితే ఇందులో సినిమాటిక్‌ అంశాలకు, కేవలం సినిమా కోసం చేసిన మార్పులు చేర్పులు బాగానే ఉంటాయి. ఈమద్య కాలంలో ప్రకాష్‌రాజ్‌ ధోని, సుమంత్‌ గోల్కోండ హైస్కూల్‌ వంటి చిత్రాలు వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేదు.

ఇక తాజాగా నాని క్రికెటర్‌గా కనిపించనున్న జెర్సీ చిత్రం క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. మరోవైపు సందీప్‌కిషన్‌ క్రీడానేపధ్యం ఉన్న చిత్రం చేయనున్నాడు. ఇక విషయానికి వస్తే అక్కినేని నాగచైతన్యకి కొంత కాలంగా బ్యాడ్‌టైం నడుస్తోంది. ఆయన సమంతతో వివాహానికి ముందు పలు చిత్రాలలో నటించినా పెళ్లయిన తర్వాత చైతు-సామ్‌లు తెరపై కూడా భార్యాభర్తలుగా నటిస్తున్న చిత్రం మజిలి. నాని నిన్నుకోరి ఫేమ్‌ శివనిర్వాణ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఈ మూవీలోని నాగచైతన్య ఫస్ట్‌లుక్‌ని న్యూఇయర్‌ కానుకగా విడుదల చేశారు. ఇందులో గడ్డం పెంచుకున్న చైతు మిడిల్‌క్లాస్‌ కుర్రాడిగా కనిపిస్తున్నాడు. తాజాగా సంక్రాంతి కానుకగా ఈ చిత్రం నుంచి సెకండ్‌పోస్టర్‌ విడుదలైంది.ఇందులో సినిమా రిలీజ్‌ డేట్‌ని కూడా ఏప్రిల్‌5 అంటూ కన్ఫార్మ్‌ చేశారు. ఇందులో నాగచైతన్య మొదటి పోస్టర్‌లోని లుక్‌కి పూర్తిడిఫరెంట్‌గా క్లీన్‌షేవ్‌తో, గ్లౌవ్స్‌, వైట్‌ అండ్‌ వైట్‌ డ్రస్స్‌లో క్రికెట్‌ బ్యాట్‌ పట్టుకుని చేతులను పైకెత్తి ఉన్నాడు. రెండో హీరోయిన్‌ దివ్యాన్షుతో రొమాంటిక్‌ మూడ్‌లో ఉన్నాడు. బ్యాగ్రౌండ్‌లో కూడా క్రికెట్‌ ఫీల్డ్‌, ప్లేయర్స్‌ ఉన్నారు. దీనితో ఈ మూవీ కథాంశం ఏమిటా? అనే ఆసక్తి కలుగుతోంది. 

chaitu, sam, new look from majili:

majili movie new poster released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ