Advertisementt

కొత్త కాన్సెప్ట్‌ అయినా ఈ హీరోకి హిట్‌ ఇస్తుందా!

Wed 16th Jan 2019 07:45 PM
sandeep kishan,santosh jagarlamudi,new movie,subramanyapuram director  కొత్త కాన్సెప్ట్‌ అయినా ఈ హీరోకి హిట్‌ ఇస్తుందా!
Young hero new movie in subramanyapuram director కొత్త కాన్సెప్ట్‌ అయినా ఈ హీరోకి హిట్‌ ఇస్తుందా!
Advertisement
Ads by CJ

తెలుగులో మంచి సినీ అండ ఉన్నయంగ్‌హీరోగా సందీప్‌కిషన్‌ని చెప్పాలి. ప్రస్థానం చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న ఈ యంగ్‌ హీరో కెరీర్‌లో వచ్చిన ఒకే ఒక్క హిట్‌ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్. హిందీలో నటించినా కూడా ఈయన ఈమద్య ఎక్కువగా తమిళ, తెలుగు ద్విభాషా చిత్రాలపై మోజుపెంచుకున్నాడు. కానీ అవి కూడా ఆయనకు వర్కౌట్‌ కావడం లేదు. కృష్ణవంశీ దర్శకత్వంలో నక్షత్రం చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఇందులో ఆయనకు సపోర్ట్‌గా సాయి ధరమ్‌తేజ్‌ వంటి వారు ఉన్నా అది డిజాస్టర్‌గా నిలిచింది. మహేష్‌బాబు సోదరి మంజుల దర్శకత్వంలో మనసుకు నచ్చింది చిత్రం చేసినా ప్రేక్షకులకు మాత్రం అది నచ్చలేదు. ప్రస్తుతం ఆయన నిన్నువీడని నీడను నేను చిత్రంలో నటిస్తున్నాడు.

తాజాగా ఈ హీరోకి ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ చిత్రంలో నటించే అవకాశం లభించింది. ఇటీవలే సుమంత్‌ హీరోగా ఈషారెబ్బా జంటగా సుబ్రహ్మణ్యపురం వంటి వెరైటీ చిత్రం తీసిన సంతోష్‌ జాగర్లమూడి ఆయనకు ఓ క్రీడానేపథ్యం ఉన్న ఇంట్రస్టింగ్‌స్టోరీని వినిపించడం, వెంటనే సందీప్‌కిషన్‌ దానికి ఓకే చేయడం కూడా జరిగిపోయాయి. మహాభారతంలోని ఏకలవ్యుడు కాన్సెప్ట్‌ని సాంఘీకరించి ఈ కథను తయారు చేశారు. 

ఏకలవ్యుడు విల్లు విద్యలో అర్జునుడిని మించిన వాడు. ఆయన ద్రోణాచార్యుడి విగ్రహాన్నే గురువుగా భావించి విలు విద్యలో అర్జునుడిని మించిన ప్రతిభ సాధించాడు. కానీ ద్రోణాచార్యుడు మాత్రం ఏకలవ్యుడిని గురు దక్షిణగా విలు కాండ్లకు అత్యంత ముఖ్యమైన బొటన వేలిని గురు దక్షిణగా అడిగాడు. ఇదే ఏకలవ్యుడు జీవితంపై గతంలో కృష్ణ హీరోగా మల్లెమాల ఓ చిత్రం నిర్మించి ఉన్నాడు. ఆధునిక కాలంలో ఓ గురువు తన ఏకలవ్య శిష్యుడిని ఎలాంటి గురు దక్షిణ అడిగాడు? అనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. కార్తికేయ చిత్రాన్ని నిర్మించిన వెంకట శ్రీనివాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండటం విశేషం. క్రీడానేపధ్యం ఉన్న చిత్రాల తాకిడి టాలీవుడ్‌లో బాగా పెరిగిన నేపధ్యంలో ఈ కొత్త కాన్సెప్ట్‌ చిత్రమైనా సందీప్‌కిషన్‌కి హిట్‌ ఇస్తుందేమో వేచిచూడాల్సివుంది...! 

Young hero new movie in subramanyapuram director:

sandeep kishan new movie in santosh jagarlamudi direction

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ