Advertisementt

తమన్‌ సత్తా చూపించాడు

Wed 16th Jan 2019 08:47 AM
ss thaman,mr majnu,rocking,album  తమన్‌ సత్తా చూపించాడు
once again walking album from Thaman తమన్‌ సత్తా చూపించాడు
Advertisement
Ads by CJ

ఈ సంక్రాంతికి భారీగా వచ్చిన కథానాయకుడు చిత్రానికి ది గ్రేట్‌ కీరవాణి సంగీతం అందించాడు. కానీ ఆయనలో ఈ మద్య కాస్త పస తగ్గిందని, కేవలం రాజమౌళి మాత్రమే ఆయన నుంచి బెస్ట్‌ అవుట్‌పుట్‌ రాబట్టుకుంటున్నాడనే ఫీలింగ్‌ని కథానాయకుడు ఆల్బమ్‌ నిరూపించింది. ఈ మూవీలోని ఒకటి రెండు పాటలు మినహా పెద్దగా హిట్‌టాక్‌ తెచ్చుకున్న సాంగ్స్‌లేవు. కీరవాణి బాహుబలి తర్వాత చేసిన సవ్యసాచి, ఇప్పుడు కథానాయకుడు పాటలను చూస్తే కీరవాణి రిటైర్‌మెంట్‌ మూడ్‌లో ఉన్నాడనే విషయం స్పష్టమవుతుంది.

ఇక వినయ విధేయ రామ చిత్రానికి దేవిశ్రీ అసలు గుర్తుంచుకోలేని విధంగా ట్యూన్స్‌ని అందించాడు. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌లో కూడా ఆయన మార్క్‌ కనిపించలేదు.ఎఫ్‌2 విషయంలో కూడా దేవిశ్రీ నిరుత్సాహపరిచాడు. ఒకవైపు దేవిశ్రీ డౌన్‌ఫాల్‌ స్టార్ట్‌ అవుతుంటే ఇప్పటి వరకు కాపీ క్యాట్‌గా పేరు తెచ్చుకున్న థమన్‌ మాత్రం తనలోని వైవిధ్యాన్ని కిందటి ఏడాది నుంచి భలేగా చూపిస్తున్నాడు. భాగమతి, తొలిప్రేమ చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన తమన్‌ ఈ ఏడాది అక్కినేని చిన్నబాబు అఖిల్‌ నటించిన మూడో చిత్రం మిస్టర్‌ మజ్నుకి మంచి సంగీతం అందించాడు. ఈ చిత్రం పూర్తి ఆడియో ఆల్బమ్‌ తాజాగా విడుదలైంది.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని అఖిల్‌ నటిస్తు జనవరి 25న రిపబ్లిక్‌డే కానుకగా విడుదల కానున్నమిస్టర్‌ మజ్ను ఆల్బమ్‌ మంచి ట్యూన్స్‌తో, మెలోడీతో అన్ని రకాల పాటలతో ఎంతో బాగుంది. గతంలో వెంకీ అట్లూరి -తమన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన తొలిప్రేమ మ్యాజిక్‌ని మరోసారి ఈ చిత్రం రిపీట్‌ చేస్తోంది.ఇందులోని ఆరుపాటలు మెలోడీగా, ట్రెండీగా ఉండటంతో ఈ ఏడాది మొదటి మ్యూజికల్‌ హిట్‌ ఆల్బమ్‌ మిస్టర్‌మజ్నునే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పాటలకు తగ్గట్టుగా తెరపై వెంకీ అట్లూరి విజువల్‌గా చూపిస్తే ఈ పాటలు ఐఫీస్ట్‌గా మారడం ఖాయమనే చెప్పాలి. మొత్తానికి తమన్‌ జోరును మరింతగా పెంచేలా ఈ పాటలు ఉండటం సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంటోందనే చెప్పాలి. 

once again walking album from Thaman:

thaman, mr majnu, juke box, released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ