Advertisementt

తోడల్లుళ్లు ఇరగదీస్తున్నారు

Wed 16th Jan 2019 08:31 AM
venkatesh,varun tej,f2 movie,rocks  తోడల్లుళ్లు ఇరగదీస్తున్నారు
venki,varun rocks at box office తోడల్లుళ్లు ఇరగదీస్తున్నారు
Advertisement
Ads by CJ
ఈ సంక్రాంతికి వరుసగా నాలుగు రోజుల్లో నాలుగు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొదటగా విడుదలైన బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్‌ బయోపిక్‌లోని తొలి పార్ట్‌ కథానాయకుడుకి మంచి టాక్‌, రేటింగ్‌, రివ్యూలు వచ్చాయి. కానీ ఈ చిత్రం ఆశించిన రీతిలో వసూళ్లను రాబట్టలేకపోతోంది. ఆ తర్వాత వచ్చిన రజనీకాంత్‌ పేట తెలుగు వెర్షన్‌ని మన ఆడియన్స్‌ పట్టించుకోవడం లేదు. నేల విడిచి సాము చేయడం, ఓవర్‌ యాక్షన్‌, లాజిక్‌ లేని మాస్‌ మసాలాతో వచ్చిన రామ్‌చరణ్‌-బోయపాటి శ్రీనుల వినయ విధేయ రామకి బ్యాడ్‌టాక్‌ వచ్చింది. ఇక చివరగా సైలెంట్‌ కిల్లర్‌గా దిల్‌రాజు-అనిల్‌రావిపూడిల కాంబినేషన్‌లో సీనియర్‌ స్టార్‌ విక్టరీ వెంకటేష్‌-మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌-తమన్నా-మెహ్రీన్‌ల నటించిన ఎఫ్‌2 ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌ కంటెంట్‌లో దమ్ము లేకపోయినా పూర్తి స్థాయి హాస్యరస చిత్రంగా రావడం, పండగలకు ప్రేక్షకులు కోరుకునే కామెడీ పుష్కళంగా ఉండటంతో ఈ చిత్రానికి మొదటి టాక్‌ నుంచే పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. మొదటి షో కంటే ఫస్ట్‌ షో నుంచి ఈ చిత్రం వసూళ్లు అద్భుతంగా పెరుగుతూ వస్తున్నాయి.
దాంతో ఈ ఏడాది సంక్రాంతి విజేతగా ఎఫ్‌2 అనే అందరు చెబుతున్నారు. మాస్‌, యాక్షన్‌ చిత్రాలలో కంటెంట్‌ లేకపోయినా, లాజిక్‌ లేకపోయినా తిరస్కరించే ప్రేక్షకులు హాస్య చిత్రాలకు మాత్రం మినహాయింపు ఇస్తారని ఈ మూవీ మరోసారి నిరూపించింది. గతంలో ఎన్నో పెద్ద చిత్రాల మద్య పోటీగా వచ్చి సంక్రాంతి విజేతలుగా నిలిచిన సోగ్గాడే చిన్నినాయనా, శతమానం భవతి వంటి చిత్రాల కోవలోనే ఇది పొంగల్‌ మూవీగా పేరు తెచ్చుకుంది. జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, రేలంగి నరసింహారావుల తర్వాత కామెడీని నమ్ముకుంటూ వరుసగా పటాస్‌, సుప్రీం, రాజా ది గ్రేట్‌ వంటి వరుస హిట్లు అందుకున్న దర్శకుడు అనిల్‌రావిపూడికి ప్రేక్షకులు మరోసారి పెద్ద పీట వేశారు. ఇందులో వెంకీ కామెడీ సీన్స్‌ని, వరుణ్‌తేజ్‌తో ఆయన నటించిన కాంబినేషన్‌ సీన్స్‌ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు.
ఈ చిత్రం ఓవర్‌సీస్‌లో చాలా తక్కువ స్క్రీన్లలో విడుదలైంది. కానీ రెండో వారం నుంచి ఈ స్క్రీన్ల సంఖ్యను భారీగా పెంచుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలలోనే గాక ఓవర్‌సీస్‌లో కూడా ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తోంది. ఇక ఈ మూవీని బాలీవుడ్‌లో గోల్‌మాల్‌ సిరీస్‌ తరహాలో సిరీస్‌గా తెరకెక్కిస్తామని, ఈ విషయంలో వెంకీ, వరుణ్‌తేజ్‌ల నుంచి అంగీకరం కూడా పొందామని అనిల్‌ రావిపూడి అంటున్నాడు. వరుణ్‌తేజ్‌ విషయానికి వస్తే అంతరిక్షం ఇచ్చిన షాక్‌ నుంచి ఈ చిత్రం ఆయనను బాగా కోలుకునేలా చేసింది. మొత్తానికి ఈ సంక్రాంతి ఈ తోడల్లుళ్లు పంచిన ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌ తో టాప్‌ ప్లేస్‌ని దక్కించుకోవడం ఖాయమైపోయింది.

venki,varun rocks at box office:

F2 movie rocks in theaters

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ