Advertisementt

దటీజ్‌....రజనీ!

Mon 14th Jan 2019 07:27 PM
rajinikanth,madhi,greatness  దటీజ్‌....రజనీ!
That Is Rajinikanth దటీజ్‌....రజనీ!
Advertisement
Ads by CJ

మంచి నటులకు మరింత మంచి మనసు, వ్యక్తిత్వం ఉంటే మరింత సుగంధం అందినట్లుగా ఉంటుంది. మన దేశ సినీ చరిత్రలో ఎవ్వరూ మరిచిపోలేని మహోన్నత మహానుభావులైన స్టార్స్‌ అందరు తమ వ్యక్తిత్వంతో కూడా మెప్పించిన వారే. ఇలాంటి నటులకు నటన నచ్చి వీరాభిమనులుగా మారిన వారికంటే వారి వ్యక్తిత్వం, మంచి మనసు చూసి ఆదరించి, దేవునిగా కొలిచే వారు ఎక్కువగా ఉంటారు. నాటి ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, అమితాబ్‌, సూపరస్టార్‌ కృష్ణ, ఎంజీఆర్‌ నుంచి పవన్‌కళ్యాణ్‌, రజనీకాంత్‌, అజిత్‌ల వరకు ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. 

ఇక రజనీ విషయానికి వస్తే దేశం గర్వించదగ్గ సూపర్‌స్టార్‌ అయిన ఆయనకు దేశంలోనే కాదు.. విదేశాలలో కూడా ఎందరో అభిమానులుఉన్నారు. ఆధ్యాత్మిక, సాధారణ జీవనం, మాసిన గడ్డం, బట్టతల, నలిగిపోయిన లాల్చీలతో ఆయన కనిపిస్తూ ఉంటారు. ఇక ఈయన గొప్పతనం గురించి తాజాగా ఓ వ్యక్తి చెప్పిన మాటలు ఆయన గొప్పతనానికి నిదర్శనం. రజనీ నుంచి సాయం పొందిన మధి అనే వ్యక్తి ప్రస్తుతం పోస్టర్స్‌, బేనర్స్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన మాట్లాడుతూ, మాది పేద కుటుంబం. 

మా అమ్మ, తాతయ్య రజనీసార్‌ ఇంట్లో పనిచేసేవారు. నా ఫీజులన్నీ రజనీసారే కట్టేవారు. ప్రతి దీపావళికి మా కుటుంబం మొత్తం రజనీ సార్‌ ఇంటికి వెళ్లేవారం. ఆయన మాకు బట్టలు, స్వీట్స్‌ ఇచ్చేవారు. రజనీ భార్య మేడమ్‌ లత గారు కూడా మమ్మల్ని ఎంతో బాగా, ఆప్యాయంగా చూసుకునే వారు. మేము కష్టాలలో ఉన్నప్పుడు రజనీ సార్‌ ఎంతో సాయం చేశారు. ఆయన వల్లే నేను ఉన్నత విద్యను అభ్యసించాను. ఆయన సినిమాలకు పోస్టర్స్‌, బేనర్లు డిజైన్‌ చేస్తూ రుణం తీర్చుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. 

That Is Rajinikanth:

Madhi Talks About Rajini

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ