Advertisementt

చివరి షెడ్యూల్లో నిఖిల్ ముద్ర.. త్వ‌ర‌లో టీజ‌ర్

Sun 13th Jan 2019 07:41 PM
mudra,nikhil,teaser  చివరి షెడ్యూల్లో నిఖిల్ ముద్ర.. త్వ‌ర‌లో టీజ‌ర్
Mudra movie update చివరి షెడ్యూల్లో నిఖిల్ ముద్ర.. త్వ‌ర‌లో టీజ‌ర్
Advertisement
Ads by CJ

>యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా తెర‌కెక్కుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ముద్ర‌. ఈ చిత్రాన్ని టిఎన్ సంతోష్ తెర‌కెక్కిస్తున్నారు. వాస్త‌విక సంఘ‌ట‌నల ఆధారంగా జ‌ర్న‌లిజం నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న సినిమా ఇది. ముద్ర షూటింగ్ చివ‌రిద‌శ‌లో ఉంది. ఐదు రోజుల టాకీ.. ఓ పాట ఈ నెల‌లో పూర్తి చేయ‌నున్నారు. డ‌బ్బింగ్ వ‌ర్క్స్, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఒకేసారి పూర్తి చేస్తున్నారు చిత్ర‌యూనిట్. అద్భుత‌మైన ఔట్ పుట్ ఇవ్వ‌డానికి చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ వ‌ర్క్స్ కూడా ఉన్నాయి.. దాంతో పాటు భారీ యాక్ష‌న్ సీక్వెన్సులు ఉన్నాయి.. అందుకే కాస్త స‌మ‌యం ఎక్కువ‌గా తీసుకుంటున్నారు యూనిట్. ఇందులో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తున్నారు నిఖిల్.. ఫ‌స్ట్ లుక్ కు కూడా అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. టీజ‌ర్ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. స్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, నాగినీడు, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర ఈ చిత్రంలో స‌హాయ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఔరా సినిమాస్ పివిటి, మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్పి బ్యాన‌ర్స్ పై కావ్య వేణుగోపాల్, రాజు కుమార్ నిర్మిస్తున్నారు. బి మ‌ధు ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు. 

న‌టీన‌టులు: 

నిఖిల్ సిద్ధార్థ్, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర, నాగినీడు..

Mudra movie update:

Mudra teaser soon

Tags:   MUDRA, NIKHIL, TEASER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ