బాలీవుడ్ నుండి మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి.. సాదా సీదా అమ్మాయిగా చాలా సింపుల్ లుక్స్ తో ఆకట్టుకున్న కియారా అద్వానీ... ఆ సినిమా విడుదల కాకమునుపే... ఆమె అందానికి ఫిదా అయిన బోయపాటి - రామ్ చరణ్ లు వినయ విధేయ రామలో ఛాన్స్ ఇచ్చారు. బాలీవుడ్ భామ కదా... బాగానే దూసుకుపోతుందిలే అని అనుకున్నారు. అయితే మొదటినుండి హీరోయిన్ కియారాకి వినయ విధేయ రామలో బోయపాటి ప్రాధాన్యత నివ్వడం లేదు.. టీజర్ లో కానీ... పోస్టర్స్ లో కానీ. ఆఖరుకి ట్రైలర్ లో కియారాకి ఎటువంటి ప్రత్యేకత లేకుండా చేశాడు.
కియారా, రామ్ చరణ్ డాన్స్ వేసే పోస్టర్స్, జనవరి ఫస్ట్ న ఒక అందమైన పోస్టర్ లో తప్ప కియారా పెద్దగా వినయ విధేయ రామలో ఫోకస్ అవ్వలేదు. అయితే బోయపాటి కియారాని ఎందుకు హైలెట్ చెయ్యలేదో వినయ విధేయ రామ చూసిన వారికీ తెలుస్తుంది. అసలు కియారా అద్వానీ, రామ్ చరణ్ సినిమా కాబట్టి కళ్ళు మూసుకుని ఒప్పేసుకుందా అనిపిస్తుంది ఆమె సీత క్యారెక్టర్. కేవలం పాటల్లో చరణ్ పక్కన స్టెప్స్ కి, అలాగే అక్కడక్కడా గ్లామర్ తో అందంగా కనిపించేందుకు మాత్రమే కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకున్నారనిపించింది. కైరా అద్వానీ పాటకు ముందొచ్చి.. పద్ధతిగా వెళ్లిపోయేది అని ఒకరు... చరణ్, కియారా కెమిస్ట్రీ ఉన్న కాసేపు పర్వాలేదని కొందరు అంటున్నారు.
కానీ పాటల్లో చరణ్ గ్రేస్ కి కియారా ఏ మాత్రం తగ్గకుండా పోటీ పడి డాన్స్ చేసి మెప్పించింది. మరి ఈ సినిమా తర్వాత ఏదో పెద్ద ప్రాజెక్ట్ తన చేతిలో ఉందని చెబుతున్న కియారాకి ఆ ప్రాజెక్టులో చోటు దక్కుతుందా.. లేదా.. అనేది ఇప్పుడు ఫుల్ సస్పెన్సు. మరి కాసేపు అందంగా గ్లామర్ గా కనబడిన డాన్స్ లలో ఆదరగొట్టింది... కనక కియారా ఛాన్సులకు ముప్పేమీ రాకపోవచ్చు. చూద్దాం అమ్మడు లక్ ఎలా ఉందో అనేది.