నా రూటే సపరేట్ అన్నా.. లేక రజనీ చెప్పిన పలు డైలాగ్‌లను తీసుకున్నా ఈ వెరైటీ డైలాగ్‌లన్నీ యువ సెన్సేషనల్ హీరో, రౌడీ ‘అర్జున్‌రెడ్డి’, ‘గోవిందుడు, ట్యాక్సీవాలా’ అయిన విజయ్‌దేవరకొండకి పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతాయి. గత ఏడాది ‘నోటా’ని కూడా పట్టించుకోకుండా, అసలా పరాజయాన్నే మించేలా ఆయన కెరీర్ అద్భుతంగా సాగింది. ప్రస్తుతం ఆయన ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వేసవి కానుకగా, వేసవి సీజన్ ఆఖరున విడుదల కానుంది. దీని అనంతరం ఆయన సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న క్రాంతిమాధవ్‌తో కె.యస్.రామారావు నిర్మాతగా ఓ చిత్రం చేయనున్నాడు.
క్రాంతి మాధవ్ విషయానికి వస్తే ఆయన తొలిచిత్రం రాజేంద్రప్రసాద్‌తో తీసిన ‘ఓనమాలు’ ప్రశంసలు దక్కించుకుంది. ఆ తర్వాత శర్వానంద్, నిత్యామీనన్ జంటగా కె.యస్.రామారావు నిర్మాతగా చేసిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ ఎంతో ఫీల్‌ని కలిగించి మెప్పించింది. కానీ ఆయన ఇటీవల సునీల్ హీరోగా తీసిన ‘ఉంగరాల రాంబాబు’ మాత్రం అసలు ఈ చిత్రం తీసింది క్రాంతిమాధవేనా అనే అనుమానం కలిగించింది. అలాంటి సెన్సిటివ్ డైరెక్టర్‌కి విజయ్ దేవరకొండ ఎంతో ధైర్యంగా ఛాన్స్ ఇవ్వడం విజయ్‌లోని సినిమాల సెలక్షన్ తీరుని ప్రతిభింబిస్తుంది. కేవలం విజయాలనే చూడకుండా మంచి టాలెంట్ ఉన్న వారికి ఆయన అవకాశం ఇస్తాడని దీనితో స్పష్టమైంది. ఇక కె.యస్.రామారావే దీనికి నిర్మాత కావడంతో మళ్లీ మళ్లీ మంచి రోజులు క్రాంతిమాధవ్‌కి వస్తాయనే ఆశ చిగురిస్తోంది. ఇక విజయ్ సరసన నటించేందుకు శ్రీదేవి కూతురు, వరుస ఆఫర్లలో బాలీవుడ్‌లో ఉన్న జాన్వీకపూర్ నుంచి రష్మికమండన.. ఇలా ఎందరో ఆసక్తి చూపుతున్నారు.
కానీ ఇందులో తాజాగా కేథరిన్ థ్రెస్సాని హీరోయిన్‌గా ఎంపికచేయడం విశేషం. మంచి నటన, అందచందాలు ఉన్న కేథరిన్ ‘సరైనోడు’లో అల్లుఅర్జున్ సరసన సెకండ్ హీరోయిన్‌గా చేసి ‘ఎమ్మెల్యే’ ( మై లక్కీ ఏంజెల్) అని నిరూపించుకున్నా ఇప్పటికీ సెకండ్ హీరోయిన్, సెకండ్ గ్రేడ్ నటిగానే ఉంది. తెలుగులో ఈమె రానా-తేజల కాంబినేషన్‌లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ తర్వాత మరో చిత్రంలో నటించలేదు. కానీ అప్పుడప్పుడు తమిళ, హిందీ చిత్రాలతో సరిపెట్టుకుంటూ వస్తోంది. మరి విజయ్‌దేవరకొండ పుణ్యమా అని ఆమె క్రేజ్ భారీగా పెరిగినా ఆశ్చర్యం లేదు.
మరోవైపు విజయ్ దేవరకొండ తన రూటే సపరేట్ అని నిరూపిస్తూ త్వరలో సొంత నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగా మారుతున్నాడు. ఇందులో తనకి హీరోగా తొలి హిట్ వచ్చిన ‘పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ని హీరోగా పరిచయం చేయనుండటం విశేషం. ఇక తరుణ్‌భాస్కర్ విషయానికి వస్తే ‘ఫిదా’ చిత్రం ద్వారా ఈయన తల్లి నటిగా మారింది. మరి హీరోగా తరుణ్ ఎలాంటి విజయం సాధిస్తాడు? ఈ మూవీకి తరుణే దర్శకత్వం వహిస్తాడా? వేరొకరు డైరెక్ట్ చేస్తాడా? వంటి విషయాలు వేచిచూడాల్సివుంది...!