Advertisementt

‘వినయ విధేయ రామ’ ప్రీమియర్ టాక్ ఇదే!

Fri 11th Jan 2019 07:29 PM
vinaya vidheya rama,first report,ram charan,boyapatri srinu,vvr,vvr first report,mega power star  ‘వినయ విధేయ రామ’ ప్రీమియర్ టాక్ ఇదే!
Vinaya Vidheya Rama Premiere Talk ‘వినయ విధేయ రామ’ ప్రీమియర్ టాక్ ఇదే!
Advertisement
Ads by CJ

బోయపాటి - రామ్ చరణ్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన వినయ విధేయ రామ నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత అర్ధరాత్రి నుండి యూఎస్ ప్రీమియర్స్ తో వినయ విధేయ రామ సందడి మొదలైంది. మెగా ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సినిమాని తిలకించడానికి చలి కూడా లెక్కచెయ్యకుండా థియేటర్స్ వద్ద బారులు తీరారు. ఇక రంగస్థలం హిట్ తర్వాత రామ్ చరణ్ ఈ మాస్ ఎంటర్టైనర్ లో నటించడంతో .. ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనూ, ఫ్యాన్స్ లోను భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఓవర్సీస్ ప్రీమియర్ షో టాక్ ప్రకారం వినయ విధేయ రామ టాక్ ఏమిటంటే... 

నలుగురు అనాధ పిల్లలకు మరో అనాధగా ఒక చిన్నబాబు వాళ్ళకి దొరుకుతాడు. వారు ఐదుగురు ఒకే రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ముల్లా పెరుగుతారని... పెరిగి పెద్దయిన వారిలో ప్రశాంత్ అంటే రామ్ (రామ్ చరణ్) పెద్దన్నయ్య.. విలన్ వివేక్ ఒబెరాయ్ వలన ఇబ్బందుల్లో పడడం... ఆ తరవాత రామ్ తన అన్న ప్రశాంత్ కోసం విలన్ తో పోటీ పడడం ఆ తర్వాత ఛేజింగ్ లు, యాక్షన్ అంతా మాస్ ప్రేక్షకులను అలరించేదిలా వినయ విధేయ రామ ఉందంటున్నారు. రంగస్థలంలో చిట్టిబాబుగా అదరగొట్టే నటనతో ఆకట్టుకున్న రామ్ చరణ్ వినయ విధేయ రామలో యాక్షన్ హీరోగా అదరగొట్టేశాడంటున్నారు.

ఇక బోయపాటి యాక్షన్ ఓ రేంజ్ లో ఉందని.. రామ్ చరణ్ నటన అద్భుతమని.. ఇంటర్వెల్ బ్లాక్ కూడా సూపర్ గా ఉందని చెబుతున్నారు. ఇక కథలో బలం లేకపోవడం.. రొటీన్ రివెంజ్ డ్రామాగా కథ ఉండడం... సెకండ్ హాఫ్ ఆకట్టుకునేలా లేదని ఓవర్సీస్ ప్రేక్షకుల టాక్. అలాగే దేవిశ్రీ అందించిన పాటల్లో రెండు పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయని... మిగతా పాటలు తేలిపోయాయంటున్నారు. మరి ఓవర్సీస్ ప్రీమియర్స్ టాక్ ఇలా ఉంది అంటే.. ఇక్కడ తెలుగు రాష్ట్రాల టాక్ ఎలా వుందో మరికాసేపట్లో మీ కోసం.

Vinaya Vidheya Rama Premiere Talk:

Vinaya Vidheya Rama First Report

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ