Advertisementt

‘యన్.టి.ఆర్’పై తారక్ స్పందనేది..?

Fri 11th Jan 2019 01:08 AM
jr ntr,balakrishna,ntr biopic,kathanayakudu,response  ‘యన్.టి.ఆర్’పై తారక్ స్పందనేది..?
Where is Jr NTR Response on NTR Biopic ‘యన్.టి.ఆర్’పై తారక్ స్పందనేది..?
Advertisement
Ads by CJ

నిన్న బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ - క్రిష్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా నందమూరి తారక రామారావు జీవిత చరిత్రలో నట జీవితాన్ని కథానాయకుడు, రాజకీయ జీవితాన్ని మహానాయకుడిగా మలిచాడు క్రిష్. కథానాయకుడు మొత్తం ఎన్టీఆర్ వ్యక్తిగత, నట జీవితాలను చూపించాడు. ఇక బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రని  అద్భుతంగా పోషించాడు. ఎన్టీఆర్ యంగేజ్ లుక్స్ లో బాలయ్య తేలిపోయింది.. నడివయసు లుక్ లో మాత్రం అదిరిపోయాడు. ఎన్టీఆర్ అందాన్ని, ఆహార్యాన్ని, నటనను బాలయ్య పుణికి పుచ్చుకున్నాడని, క్రిష్ డైరెక్షన్ ని ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు కొనియాడుతున్నారు. ఇక నిన్న బుధవారం ఉదయం మహేష్ బాబు ఏఎంబి మల్టిప్లెక్స్ లో బాలయ్య అంటే నందమూరి ఫ్యామిలీ మొత్తం ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాని వీక్షించింది. 

ఇక బాలయ్య నటనను, కథానాయకుడు చిత్రాన్ని పలువురు ప్రముఖులు వీక్షించి కొనియాడుతున్నారు. మోహన్ బాబు అయితే అన్నగారు జీవిత చరిత్రలో బాలయ్య నటన అద్భుతమన్నాడు. అలాగే తండ్రి పోలికలతో బాలయ్య పుట్టాడని.. అన్నగారిని మరిపించాడంటూ ట్వీట్ చేశాడు. ఇక మహేష్ బాబు అయితే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని చూశానని సూపర్ గా ఉందని... రెండో పార్ట్ మహానాయకుడు కోసం వెయిటింగ్ అంటూ ట్వీట్ చేశాడు. మరి నందమూరి అభిమానులు, పరిశ్రమలోని ప్రముఖులు ఎన్టీఆర్ కథానాయకుడు వీక్షించి అద్భుతమంటూ ట్వీట్స్ చేస్తుంటే.... నందమూరి ఫ్యామిలీ సభ్యుడైన తారక్ అదేనండి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కథానాయకుడు మీద గాని, బాబాయ్ బాలకృష్ణ గురించి గాని ఎక్కడ ట్వీట్ వెయ్యడం కానీ మట్లాడడం కానీ లేదు. ఎన్టీఆర్ బయోపిక్ లో ఛాన్స్ ఇవ్వలేదు కానీ.. కథానాయకుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలకృష్ణ పిలవగానే ఎన్టీఆర్ ఆ ఈవెంట్ కి నందమూరి ఫ్యామిలీతో పాటుగా హాజరయ్యాడు. అయితే బాలయ్య - ఎన్టీఆర్ లు పైకి కలిసినట్టు కనబడినా వాళ్ళు కలవలేదని అడుగడుగునా నిరూపితమవుతుంది.

ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఎక్కడా మాట్లాడని ఎన్టీఆర్... ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేశాడు. అక్కడ బాలయ్య, ఎన్టీఆర్ లు ఆప్యాయంగా కనబడి నందమూరి అభిమానులను ఖుషి చేశారు. ఇక రాజమౌళి కొడుకు కార్తికేయ సంగీత్ లో నాగార్జున, అఖిల్, రామ్ చరణ్ తో కలిసి జై బాలయ్య అంటూ ఎన్టీఆర్ గోల గోల చేశాడు. ఇక కథానాయకుడు స్పెషల్ షోకి ఎన్టీఆర్ వస్తాడనుకున్నారు. కట్ చేస్తే ఎక్కడా ఎన్టీఆర్ కనబడలేదు.. కనీసం కథానాయకుడు గురించిన ట్వీట్ కూడా ఎన్టీఆర్ చెయ్యలేదు. మరి ప్రస్తుతానికి RRR షెడ్యూల్ కూడా లేదు.. బిజీగా ఉండి కథానాయకుడు చూడలేదు అనుకోవడానికి.... ఏమో ఎన్టీఆర్ మనసులో ఏముందో ఆ దేవుడికే తెలియాలి. కానీ కళ్యాణ్ రామ్ అటు తమ్ముడు ఎన్టీఆర్ ని... ఇటు బాలయ్య బాబాయ్ ని సమానంగా శాటిస్ఫాయ్ చేసుకుపోతున్నాడు.

Where is Jr NTR Response on NTR Biopic:

Jr NTR Dearly Missed in Kathanayakudu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ