జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్‌కి ప్రాణస్నేహితులంటూ ఇద్దరే అని ప్రచారం జరుగుతున్న మాట నిజమే. వారిలో బండ్లగణేష్, అలీలు ముందుంటారు. కానీ నిజానికి పవన్‌కి నిజమైన శ్రేయోభిలాషి ఎవరు? అనే ప్రశ్న వస్తే మాత్రం అలీ పేరే చెప్పాలి. బండ్లగణేష్ చేసేవన్నీ ఆర్ధికపరంగా లాభం చేకూర్చుకోవడం, నిర్మాతగా పవన్ కాల్షీట్స్‌ని, మెగాభిమానులను తన వైపుకు తిప్పుకోవడం కోసమేనని గట్టి వాదన ఉంది. అది నిజం కూడా. బండ్లగణేష్ పచ్చి అవకాశవాది తప్ప ఆయనలో మంచి స్నేహితునికి ఉండాల్సిన లక్షణాలు ఏమీ ఉండవనేది అందరికీ తెలిసిన విషయమే. ఏ ఎండకా గొడుపు పట్టే నైజం ఆయనది.
పవన్ చేరదీసి నిర్మాతను చేసి నిలబెడితే ఆయన మాత్రం తనకు అవసరమైనప్పుడు మాత్రం పవన్ జపం చేసేవాడు. ఇక ఈయన జనసేనానిని కాదని కాంగ్రెస్‌లో చేరడం పెద్దగా ఆశ్చర్యం కలిగించే విషయం కూడా కాదు. ఇక ఆ మధ్య శరత్‌మరార్ కూడా పవన్‌కి దగ్గరైనట్లు కనిపించాడు గానీ ఆయనది కూడా బండ్ల మార్క్ ప్రేమే అని అంటారు. ఇక పవన్‌ని ఏ స్వార్థం కోసం ఉపయోగించుకోని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అలీనే అని ఘంటాపథంగా చెప్పవచ్చు.
ఇక విషయానికి వస్తే త్వరలో ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపధ్యంలో హాస్యనటునిగా కాస్త హవా తగ్గిన అలీ రాజకీయాలలోకి రావడం ఖాయమని తేలింది. గతంలోనే అలీ రాజకీయాలలోకి వస్తాడని, తెలుగుదేశం పార్టీ తరపున రాజమండ్రిలో గానీ ఆయా పరిసర ప్రాంతాలలో కూడా పోటీ చేస్తాడని వార్తలు వచ్చినా అలీ మాత్రం తొందరపడలేదు.
తాజాగా అలీ వైసీపీలో చేరబోతున్నాడని వార్తలు హల్‌చల్ చేసినా వాటిని నమ్మిన వారు కొద్ది మంది మాత్రమే. ఎందుకంటే ఏపీలో ఇంకా పొత్తులు ఖరారు అయి స్పష్టత రాలేదు. అలీ వైసీపీలో చేరుతాడని, జగన్ పాదయాత్ర చివరిరోజు ఆయన పార్టీ కండువా కప్పుకుంటాడని కూడా కొందరు వార్తలు వండివార్చారు. కానీ అలీ మాత్రం వీటికి చెక్ చెబుతూ చంద్రబాబునాయుడుతో, పవన్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యాడు.
తాజాగా ఆయన ఏపీ మంత్రి, ఇటు మెగాఫ్యామిలీకి, చంద్రబాబుకి ఇద్దరికీ కావాల్సిన గంటా శ్రీనివాసరావుని కలిసి మంతనాలు సాగించాడు. మరి రాబోయే రోజుల్లో అలీ టిడిపిలో చేరుతాడా? జనసేనలోకి వస్తాడా? అదే జరిగితే ఎన్నికల్లో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ మరోసారి ఏపీలో టిడిపి, జనసేనల మద్య పొత్తు ఉండే అవకాశం ఉందా? అనే ఆసక్తికర చర్చకు సమాధానం కావాలంటే అలీ నోరు విప్పాల్సిందే...!