బుల్లి తెరలో రెండు మూడు ప్రోగ్రామ్స్ చేస్తూ నటన పరంగా కూడా మంచి సక్సెస్ అందుకుంటుంది అనసూయ. చాలా తక్కువ సినిమాలే చేసినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో ‘రంగస్థలం’ సినిమాతో ఒక ఊపు ఊపేసిన అనసూయ తనలో ఇంత టాలెంట్ ఉందని చూపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
‘క్షణం’ సినిమాలో నెగటివ్ రోల్ చేసి అందరిని ఫిదా చేసిన అను ఇప్పుడు ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవడం లేదు. ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఓకే చేస్తుంది. అయితే ఈమెకు రీసెంట్ గా మరో మూవీలో ఛాన్స్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. మహేష్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో రంగమ్మత్తకు మరో మంచి పాత్ర దొరికిందట. సుకుమార్ తనకు రెండోసారి అవకాశం ఇవ్వనున్నాడని టాక్.
ఈ సినిమాలో అనసూయ పాత్ర తన నటనలో మరో స్థాయిలో చూపించే పాత్ర అవుతుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్‌తో చేసే చిత్రంతో మహేష్ బిజీ కానున్నాడు.