దాదాపు ఈ ఐదేళ్ల పాలనలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం, బిజెపి నాయకత్వం, మోదీ తీసుకున్న ఒకే ఒక్క అద్భుతమైన నిర్ణయం అగ్రవర్ణాల పేదలకు 10శాతం రిజర్వేషన్లు కలిపిస్తూ తీసుకున్న నిర్ణయమనే చెప్పాలి. దీనిని ఏవో మజ్లిస్, అన్నాడీఎంకే వంటి ఒకటి రెండు పార్టీలు తప్ప ప్రతి ఒక్కరు మద్దతు తెలుపక తప్పనిసరి పరిస్థితిని మోదీ అద్భుతంగా సంధించాడు. నిజానికి ప్రపంచంలో ఉండేవి రెండే వర్గాలు. ఒకటి పేదలు, బలహీనులు.. రెండు ధనవంతులు, బలవంతులు మాత్రమే.
మన దేశంలో ఎంతో ముందు చూపుతో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ సిస్టం ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో ఓ ఫెయిల్యూర్ స్టోరీగానే చెప్పాలి. రిజర్వేషన్లు కూడా దళితులు, వెనుకబడిన వర్గాల మాటున కొందరికే పరిమితం అయ్యాయి గానీ ఎక్కడో ఉండే గిరిజన తండాల వంటి చోట తమకు ఇన్ని రిజర్వేషన్లు ఉన్నాయని కూడా చాలా మందికి తెలియని పరిస్థితి బాధాకరం. ముఖ్యంగా ఎస్సీలలో మరీ ముఖ్యంగా మాల సామాజిక వర్గం మాత్రమే వీటిని బాగా ఉపయోగించుకుంటూ ఉంది.
అయినా ఇందులో అంబేద్కర్ తప్పేమి లేదు. ఆయన దీర్ఘకాలం, రాజకీయ ప్రయోజనాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఇవి కొనసాగితే అసలు ఉద్దేశ్యం మరుగున పడి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయని నాడే హెచ్చరించాడు. ఆయన భయపడిందే నిజం అవుతోంది. ఇక మోదీ తీసుకున్న ఈ నిర్ణయం దీనికి తొలిమెట్టుగానే భావించాలి. కుల, మత, జాతి వివక్ష పోవాలంటే ఆర్ధికంగా వెనుకబడిన ఈ బీసీలందరికీ మేలు జరిగి, చిన్నగా కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికను రిజర్వేషన్లు తగ్గుతూ వస్తేనే పేదలందరికీ అసలైన అభివృద్ది ఫలాలు అవుతాయి.
అయినా నేడున్న విద్యావ్యవస్థలో, ప్రైవేటీకరణ నేపధ్యంలో అసలు రిజర్వేషన్లు అనే వాటికే మనుగడ లేకుండా పోయింది కాబట్టి ఈరోజుల్లో రిజర్వేషన్ల కోసం పట్టుబట్టడం వల్ల కూడా ఎలాంటి ఉపయోగం లేదనే చెప్పాలి. ఇక తాజాగా మన హీరోలు కూడా సామాజిక స్పృహలో ఉంటారని యంగ్ హీరోలు రానా, నిఖిల్‌లు నిరూపించారు. ఆర్ధికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు సంబంధించిన రిజర్వేషన్లలో తాజాగా జరిగిన ‘నెంబర్ వన్ యారి’ కార్యక్రమ సమయంలో తాము ఇదే విషయం చర్చించుకున్నామని, నేడు మోదీ అదే నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉందని నిఖిల్ తెలిపాడు.
ఇక నిఖిల్ వైవిధ్యభరితమైన కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈయన ఇటీవల నటించిన కన్నడ రీమేక్ ‘కిర్రాక్‌పార్టీ’ మాత్రం పెద్దగా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఆయన తమిళంలో మంచి విజయం సాధించిన ‘కణితన్’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. ‘ముద్ర’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది.
దీనితో పాటు తాను నటించిన మొత్తం మూడు చిత్రాలు ఇదే ఏడాది విడుదల కానున్నాయని, వాటికి సంబంధించిన కథాచర్చలు కూడా పూర్తయ్యాయని నిఖిల్ ప్రకటించాడు. మొత్తానికి మన యంగ్ హీరోలకు తమ కెరీర్‌తో పాటు సామాజిక స్థితిగతులపై కూడా మంచి అవగాహన ఉండటం ప్రశంసించాల్సిన విషయం...!