ఇండస్ట్రీలో నాకున్న అత్యంత సన్నిహితుడు చిరంజీవి మాత్రమే అని బయటికి చెప్పే బాలకృష్ణ ఆ మధ్య పవన్‌కల్యాణ్ ఎవరంటూ ఓ మీడియా వ్యక్తి అడిగితే వెటకారంగా సమాధానం చెప్పాడు. అంతటితో ఆగారా అంటే అదీ లేదు. రాజకీయాల్లో వేళుపెట్టి అమితాబ్ బచ్చన్ ఏమి పీకారు..చిరంజీవి పరిస్థితీ అంతే కదా!.. మేము వేరు మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అంటూ కొత్త వివాదానికి తెరతీశారు. గత కొంత కాలంగా మెగా కుటుంబంపై బాలయ్య చేస్తున్న వ్యాఖ్యలకు గత వారం రోజులుగా మెగాబ్రదర్ నాగబాబు కౌంటర్ ఎటాక్ ఇస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. ఆయన బాలయ్యను విమర్శిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాగబాబు సోషల్ మీడియాలో తనను మించిపోయాడని ఫీలయ్యాడో..లేక ఈ వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నాడో తెలియదు కానీ నాగబాబు వీడియోలపై వర్మ స్పందించాడు. `కామెంట్ల విషయంలో నన్ను మించిపోయారనే బాధ ఒకవైపు..తన స్టార్ బ్రదర్స్‌ని సమర్థించడంలో సూపర్‌స్టార్ అయిపోయారన్న అనందం మరో వైపు ..ఒక కంట కన్నీరు..మరో కంట పన్నీరు.. నాగబాబుగారూ హ్యాట్సాఫ్. మీ సోదరులను మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో.. ముం అంటే ప్రేమిస్తున్నాం` అంటూ వర్మ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. వర్మ ట్వీట్‌లని చూసిన వారంతా రామాయణంలో పిడకలవేట అంటే ఇదే మరి అంటూ వర్మపై సెటైర్లు వేస్తున్నారు.