ఈ సంక్రాంతికి వస్తున్న ‘కథానాయకుడు, పేట, వినయ విధేయ రామ, ఎఫ్2’ ల విషయానికి వస్తే ‘కథానాయకుడు’ కొత్తతరహా చిత్రాలను చూసే వారికి, నందమూరి అభిమానులకు, తెలుగుదేశం వీరాభిమానులకు నచ్చే చిత్రంగా చెప్పుకోవాలి. ఇక ‘వినయ విధేయ రామ’ మాస్, యాక్షన్ చిత్రాల ప్రేమికులకు, వీరమాస్, బోయపాటి-చరణ్‌ల హౌఓల్టేజ్ యాక్షన్‌ని చూడాలనుకునే వారికి, మెగాభిమానులకు బొనాంజానే అని చెప్పాలి.
అయితే సైలెంట్ కిల్లర్‌గా వస్తోన్న చిత్రం మాత్రం దిల్‌రాజు నిర్మాణంలో, ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎక్కువగా నమ్ముకునే దర్శకుడు అనిల్‌రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్-మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్‌లు కలిసి నటిస్తున్న ‘ఎఫ్2’ చిత్రం. అయితే ఈమధ్య దిల్‌రాజుకి వరుసగా నిర్మాతగా, పంపిణీదారునిగా కూడా వరుస దెబ్బలు తగులుతున్నాయి. అయినా అనిల్‌రావిపూడి మాత్రం ‘హ్యాట్రిక్ హిట్స్’తో జోరుమీదున్నాడు.
ఇక వెంకీ ‘గురు’ తర్వాత ఎంతో గ్యాప్ తీసుకుని, తనదైన కామెడీని, ఫ్యామిలీ సీన్స్‌ని కలగలిపి అందరికీ ఆనందాన్ని కలిగించడానికి వస్తున్నాడు. మరోవైపు వరుణ్‌తేజ్ నటిస్తున్న తొలి మల్టీస్టారర్ మూవీ కావడం, వెంకటేష్ వంటి సీనియర్ పక్కన ఉండటంతో కామెడీ, ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎలా మెప్పించాలో నేర్చుకునే అవకాశం వరుణ్‌కి ఉంది.
‘అంతరిక్షం’ నిరాశ పరిచిన తర్వాత ‘ఎఫ్2’ రానుండటంతో ఈ మూవీ వరుణ్‌కి కూడా కీలకం కానుంది. గతంలో ‘సోగ్గాడే చిన్నినాయనా, రన్ రాజా రన్, శతమానం భవతి’ ఇలా సైలెంట్ కిల్లర్స్‌గా వచ్చి సంచలనం సృష్టించిన కోవలోకి ‘ఎఫ్2’ చేరుతుందని పలువురు ఆశగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్‌లో కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ని నమ్ముకుంటూ వెంకీ చేత చెప్పించిన సెటైర్లు బాగా పేలుతున్నాయి. మరి ‘ఎఫ్2’ ఎలాంటి ఫలితం అందుకుంటుందో వేచిచూడాలి....!