సంక్రాంతి బరిలోకి దిగుతున్న చిత్రాలలో ముందుగా ‘కథానాయకుడు’ విడుదల కానుంది. 10వ తేదీన ‘పేట’ వస్తున్నప్పటికీ తెలుగులో వస్తున్న స్ట్రెయిట్ చిత్రాలు, థియేటర్ల విషయంలో ‘పేట’ది కాస్త ఇబ్బందికర పరిస్థితి కాబట్టి మొదటి రెండు రోజులు ‘కథానాయకుడు’ కలెక్షన్ల పరంగా కుమ్మేస్తుంది అని భావిస్తున్నారు. ఇందులో నిజం కూడా ఉంది.
మొదటి రెండు రోజుల ‘కథానాయకుడు’కి బాగా కలిసి వచ్చేఅంశం. ఇది 11వ తేదీన ‘వినయ విధేయ రామ’ వచ్చే వరకు బాగా పనిచేస్తుంది. ఇక ఎక్కువగా సెంటిమెంట్లకు, జాతకాలు, మంచి ముహూర్తాలకు ప్రాధాన్యం ఇచ్చే బాలయ్య తెలంగాణలో ప్రత్యేక షోలు, బెనిఫిట్ షోలకు అనుమతి లేకపోవడంలో కూకట్‌పల్లిలోని తనకి అచ్చి వచ్చిన భ్రమరాంబ థియేటర్‌లో మాత్రం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో 5గంటలకు షో వేయించి, యూనిట్‌తో సహా థియేటర్‌లో ప్రత్యక్షంగా వీక్షించనున్నాడు.
ఇక ఏపీలో ‘కథానాయకుడు’కి టిడిపి ప్రభుత్వం వల్ల తిరుగులేదనే చెప్పాలి. ఇక్కడ, ఓవర్‌సీస్‌లో ప్రత్యేక షోలు, బెనిఫిట్ షోల ద్వారా భారీగా కలెక్షన్లు రావడం ఖాయమనే చెప్పాలి. మొత్తానికి సంక్రాంతి విజేతగా ఏ చిత్రం నిలుస్తుందో వేచిచూడాల్సివుంది...! మొత్తానికి బాలయ్య కెరీర్‌లో, నందమూరి అభిమానుల్లో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కంటే మిన్నగా ‘కథానాయకుడు, మహానాయకుడు’లనే భారీ అంచనాలు, తమ చిత్రాన్ని రికార్డులు బద్దలు కొట్టేలా చేయాలనే తలంపుతో కొందరు విశేషకృషి చేస్తున్నారు.
మరి ‘కథానాయకుడు’ అంచనాలకు తగ్గట్లు నిలిచి, ఏ స్థాయిలో విజయవంతం అవుతుందో వేచిచూడాల్సివుంది...!