రేపు ఈ టైంకి ఎన్టీఆర్ బయోపిక్ సంబంధించి ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అవ్వబోతుంది. ఎన్టీఆర్ జీవిత కథ కాబట్టి అందరికి ఈసినిమా చూడాలని కుతూహలం ఏర్పడింది. అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా విభజించడం చాలామందికి ఇష్టం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ నటన జీవితం వడ్డించిన విస్తరి కావడంతో అక్కడ ఎత్తుపల్లాలు ఏమీ ఉండవు.
ఎన్టీఆర్ జీవితంలో ఎత్తులు పల్లాలు ఏమన్నా ఉన్నాయి అంటే అది ఆయన రాజకీయ జీవితంలోనే. ఎన్టీఆర్ కథానాయకుడులో తన భార్య మధ్య అనుబంధం..పలు గెటప్స్ చూసుకుని ఆనందం పడటం తప్ప వేరే ఏమి ఉండదనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. అరవై గెటప్పులు..పలు చిత్రాల్లోని పాటలు, సీన్ల క్లిప్పింగ్స్ వరకు చూపిస్తే ఫ్యాన్స్ కు పండగ గా ఉంటుంది కానీ మిగిలిన ప్రేక్షకులు నిరాశ పడే అవకాశం లేకపోలేదు.
మరి డైరెక్టర్ క్రిష్ ఎంతవరకు ఆ బోర్ లేకుండా తీశారనేది చూడాలి. విడుదలకి ఇంకొన్ని గంటలు మాత్రమే ఉండటంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఒకవేళ ఎన్టీఆర్ మహానాయకుడు లో నిజాలని చూపించకపోతే.. ప్రేక్షకులు ఆ సినిమాను అంగీకరించే అవకాశంలేదు. సో ఈ రెండు పార్టులు ఎన్టీఆర్ టీమ్‌కు ఛాలెంజింగ్‌గా మారింది.