Advertisementt

‘యాత్ర’ ట్రైలర్: ప్రతి ఫ్రేమ్ హైలెట్టే..!!

Tue 08th Jan 2019 08:30 PM
yatra,ysr biopic,yatra movie,yatra trailer,yatra trailer talk,ys rajasekhar reddy  ‘యాత్ర’ ట్రైలర్: ప్రతి ఫ్రేమ్ హైలెట్టే..!!
Yatra Trailer Review ‘యాత్ర’ ట్రైలర్: ప్రతి ఫ్రేమ్ హైలెట్టే..!!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో బయోపిక్‌ల హోరు మాములుగా లేదు. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు రేపు విడుదల కాబోతుంటే.. మరో పేరున్న నాయకుడు వైఎస్ఆర్ బయోపిక్ యాత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాని మహి వి రాఘవ తెరకెక్కిస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి పాద యాత్ర ద్వారా కాంగ్రెస్ ని ఎలా అధికారంలోకి తీసుకొచ్చాడో అనేది ఈ యాత్ర సినిమాలో చూపించబోతున్నారు. అయితే ఈ యాత్ర సినిమాని వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగానే తెరకెక్కిస్తున్నారు. అందుకే యాత్ర ట్రైలర్ లో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ హైలెట్ కాకుండా హస్తం గుర్తు కనబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

రాజశేఖర రెడ్డి పాదయాత్రతో జనాల మనసులను ఎలా గెలుచుకున్నాడు.. ఆయన అంతరాత్మ చెప్పింది విని ఎలా నడుచుకున్నాడు, ఇంకా రాజశేఖర్ రెడ్డి ని చూసి ఇంతగా మా కోసమా కష్టపడుతున్నావు.. నీవు మారావని నమ్ముతున్నాను.. ఈసారి నా ఓటు నీకే.... నేను వేసే ఓటు నీ పార్టీని చూసి వెయ్యను... నీ కోసం వేస్తా అంటూ చెప్పడం, అలాగే పాద యాత్రలో మమ్ముట్టి జనాలతో మమేకమవడం, ఇంకా ప్రజలు కూడా రాజశేఖరుడుని దేవుడిలా కొలవడం, ఇక నాయకుడిగా మనకేం కావాలో తెలుసుకోగలిగాం కానీ.. జనాలకేం కావాలో తెలుసుకోలేకపోయామని అంతర్మధనంతో పాదయాత్ర చేపట్టడం ఇలా అన్ని విషయాల్లోనూ రాజశేఖర్ రెడ్డినే హైలెట్ చేశారు.

ఇక మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి మ్యానరిజం, స్టయిల్, లుక్స్ అన్నింటిలో పోటీ పడ్డాడు. అసలు మమ్ముట్టి తప్ప రాజశేఖర్ రెడ్డిగా మరెవరిని ఊహించలేం అన్నట్టుగా ఉంది ఆయన లుక్స్. ఇక రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. రాజశేఖర్ రెడ్డి వెనుక జనం, ఆయన బలం అన్నట్టుగా ఉంది ట్రైలర్. మరి ప్రస్తుతం పాద యాత్ర చేస్తున్న జగన్ కి ఈ సినిమా కలిసొచ్చే అంశంలాగా కనబడుతుంది.  తండ్రి పోయాక ముఖ్యమంత్రి పీఠం కోసం జగన్ గత తొమ్మిదేళ్లుగా కష్టపడుతున్నాడు. ఇక యాత్ర సినిమాకి మమ్ముట్టి మెయిన్ హైలెట్ అన్నట్లుగా ప్రతి ఫ్రేమ్ లోను కనిపించాడు. యాత్ర సినిమా ఫిబ్రవరి ఎనిమిదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. 

Click Here for Trailer

Yatra Trailer Review :

YSR Yatra Biopic Traile Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ