Advertisementt

ఎన్టీఆర్ మొదటి షో టికెట్ ఎంతకి కొన్నారో తెలుసా..?

Tue 08th Jan 2019 07:22 PM
ntr,ntr kathanayakudu,balakrishna,krish  ఎన్టీఆర్ మొదటి షో టికెట్ ఎంతకి కొన్నారో తెలుసా..?
NTR Benefit Show Ticket Sold for Shocking Price ఎన్టీఆర్ మొదటి షో టికెట్ ఎంతకి కొన్నారో తెలుసా..?
Advertisement
Ads by CJ

ఈమధ్య తెలంగాణ ఏరియాలో బెనిఫిట్ షోలు ఆపేయడం, ఆంధ్రాలో బెనిఫిట్ షోస్ కి బదులుగా రోజుకి అయిదు లేదా ఆరు షోలు వేసుకొనే సౌలభ్యం కల్పించడం కారణంగా బెనిఫిట్ షోలు మాయమైపోయాయి కానీ.. ఒక రెండేళ్ల క్రితం వరకూ కూడా ఆ బెనిఫిట్ షోల హడావుడి మామూలుగా ఉండేది కాదు. ముఖ్యంగా ఆ బెనిఫిట్ షోల టికెట్లు సంపాదించడానికి నానా ఇబ్బందులుపడాల్సి వచ్చేది. అభిమానులందరూ ఫ్యాన్స్ ప్రెసిడెంట్స్ దగ్గర క్యూ కడితే.. సాధారణ ప్రేక్షకులు థియేటర్ల ముందు ఒకరోజు ముందు నుంచీ నిల్చునేవారు. ఇక బడా బాబులు ఏమో టికెట్లు కూడా పాట పాడేవారు. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోల హల్ చల్ తగ్గిపోయింది కానీ.. ఓవర్సీస్ లో మాత్రం ఆ జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. 

తాజాగా ఎన్టీఆర్ కథానాయకుడు బెనిఫిట్ షో టికెట్స్ కు భీభత్సమైన రేట్ పలికింది. ఈ సినిమా మొదటి టికెట్ ను ఓ ఎన్నారై నందమూరి అభిమాని ఏకంగా మూడున్నర లక్షల రూపాయలకు సొంతం చేసుకొన్నాడు. ఆ డబ్బును డిస్ట్రిబ్యూటర్ బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ కు డొనేట్ చేశాడనుకోండి. అయితే.. ఈమధ్యకాలంలో ఈ రేంజ్ లో ఒక సినిమా టికెట్ అమ్ముడవ్వడం ఇదే కావడంతో ఈ విషయం అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షించింది. 

ఇకపోతే.. మరికొన్ని గంటల్లో మొదలవ్వనున్న ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా మీద నందమూరి అభిమానులు విశేషమైన అంచనాలు, ఆశలు పెట్టుకొన్నారు. మరి సినిమా వాటిని అందుకోగలుగుతుందో లేదో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. 

NTR Benefit Show Ticket Sold for Shocking Price:

NTR Kathanayakudu Benefit Show tickets in USA were sold for record price

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ