పెట్ట ప్రీరిలీజ్ ఈవెంట్ లో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వల్లభనేని అశోక్ తన తోటి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ అయిన దిల్ రాజు, అల్లు అరవింద లను దారుణంగా తిట్టిన విషయం తెలిసిందే. ఈ విషయమై నిన్న దిల్ రాజు ఎఫ్ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సరిగ్గానే సమాధానమిచ్చారు. సంక్రాంతికి మూడు పెద్ద తెలుగు సినిమాలు విడుదలవుతుంటే అనువాద చిత్రానికి థియేటర్లు ఎలా దొరుకుతాయి. మూడు తెలుగు సినిమాలకే థియేటర్లు సరిపోని పరిస్థితి. 18వ తేదీ నుంచి పేటనే ఉంటదని చెబుతున్న అశోక్ ఆరోజే విడుదల చేసుకోవచ్ఛు కదా. ఈ ఏడాది పంపిణీదారుడిగా చాలా డబ్బులు పోగొట్టుకున్నా. తెలుగు సినిమాల విడుదల తేదీ ఆరు నెలల ముందే ప్రకటించాం. అశోక్ అనుచితంగా మాట్లాడటం సరైంది కాదు అని దిల్ రాజు సమాధానమిచ్చారు.
కానీ.. అశోక్ వల్లభనేని తన మాటలతో దాడి చేయడం ఆపలేదు. నిన్న సాయంత్రం టీవి9 భేటీలో మాట్లాడుతూ మరోసారి నోరు జారాడు. ఇలా థియేటర్ల మాఫియా చేసి.. ఇంత డబ్బు సంపాదించి.. ఇంతమంది నిర్మాతల ఉసురు పోసుకొనే బదులు వాళ్ళ అమ్మాయిలని పడుకోబెట్టి ఇంతకంటే ఎక్కువే సంపాదించుకోవచ్చు అని వల్లభనేని అశోక్ అనడం పెను దుమారానికి దారి తీసింది. దిల్ రాజు, బన్నీ వాసులు ఆల్రెడీ ఆరు నెలల ముందు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన తెలుగు సినిమాలకే థియేటర్లు దొరక్క చాలా ఇబ్బందులుపడుతున్న తరుణంలో ఇలా నెల ముందు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన తమిళ డబ్బింగ్ సినిమాకు థియేటర్స్ కావాలని అశోక్ వల్లభనేని ఈ తరహా హేయమైన భావజాలంతో మాట్లాడడం అనేది ఎంతవరకూ సమంజసం అనేది తెలియాలి.
అసలు నిన్న స్టేజ్ మీద అన్నదానికే గీతా ఆర్ట్స్ బ్యాచ్ అందరూ అశోక్ మరియు ప్రసన్నకుమార్ మీద తిరగబడింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఫ్యామిలీ జోలికి వచ్చిన అశోక్ ను అంత సులువుగా వదిలే అవకాశం మాత్రం కనిపించడం లేదు.