నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి చిత్రం షూటింగ్ ప్రారంభం..
ఇటీవల పెళ్లి చూపులు, మెంటల్ మదిలో చిత్రాలని నిర్మించి నేషనల్ అవార్డ్, ఫిల్మ్ ఫేర్ అవార్డులని పొందిన రాజ్ కందుకూరి.. ఇప్పుడు ధర్మపథ క్రియేషన్స్ పై మరో లేడి డైరెక్టర్ ని సినిమా రంగానికి పరిచయం చేస్తున్నారు. అందులో తన కుమారుడు శివ కందుకూరి హీరోగా కనిపించబోతున్నారు. శివ కందుకూరి అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఈ మధ్యే ఇండియాకి వచ్చారు. ఇంతకు ముందు ప్రముఖ దర్శకులు సుకుమార్ మరియు క్రిష్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన శేష సింధు రావ్ ని ఈ చిత్రంతో దర్శకురాలుగా రాజ్ కందుకూరి పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. తమిళంలో ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించిన 96 చిత్రం ఫేమ్ వర్ష ఇందులో కధానాయికగా పరిచయం అవుతున్నారు. మహానటి చిత్రానికి స్క్రీన్ ప్లే మరియు మాటలు అందించిన పద్మావతి విశ్వేశ్వర్ ఈ చిత్రానికి దర్శకురాలితో కలిసి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. రవితేజ గిరజాల ఈ చిత్రానికి ఎడిటర్. వేద రామన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు మరియు మధుర శ్రీధర్ లు ఈ చిత్ర నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.
నటీనటులు.. శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ
సాంకేతిక నిపుణులు..
దర్శకురాలు: శేష సింధు రావు
నిర్మాత: రాజ్ కందుకూరి
నిర్మాణ సంస్థ: ధర్మపత క్రియేషన్స్
సమర్పకులు: దగ్గుపాటి సురేష్ బాబు, మధురా శ్రీధర్
సంగీతం: గోపీసుందర్
సినిమాటోగ్రఫీ: వేద వర్మ
మాటలు, స్క్రీన్ ప్లే: పద్మావతి విశ్వేశ్వర్