ఈ సంక్రాంతికి అలాంటి ఇలాంటి పోటీ లేదు. నందమూరి, మెగా హీరోల సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటీ పడుతున్నాయి. నందమూరి హీరో ఒక్క సినిమాతో వస్తుంటే మెగా హీరోలు రెండు సినిమాలతో బాక్సాఫీసుని దున్నేయ్యడానికి రెడీ అయ్యారు. నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు రేపు ఈవెనింగ్ నుండే సందడి చేయబోతుంది. మంగళవారం సాయంత్రం నుండే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో తన ప్రతాపం చూపించబోతుంది. ఇక రామ్ చరణ్ వినయ విధేయ రామ శుక్రవారం, వరుణ్ వెంకీల ఎఫ్ టు శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే ఈ సంక్రాంతికి మెయిన్ పోటీ పోయి ఎన్టీఆర్ కథానాయకుడు వినయ విధేయ రామ ల మధ్యనే ఉండబోతుంది.
అయితే ప్రస్తుతం సంక్రాంతి సినిమాల ప్రమోషన్స్ తో మీడియా మొత్తం హోరెత్తుతుంటే... రామ్ చరణ్ వినయ విధేయ రామ ప్రమోషన్స్ లో తనకు ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా మీద ఆసక్తి ఉందని... ఆ సినిమా విడుదల కోసం వెయిటింగ్ అంటూ చెప్పి నందమూరి అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని గౌరవించాలి అని... నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ఎన్టీఆర్ టీం ఎంతో గౌరవంతో ఈ ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కించిందని... దర్శకుడు క్రిష్ ఎలా ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ జీవితాన్ని చూపించబోతున్నాడో చూడాలని ఉందని చెప్పాడు.
ఇంకా సంక్రాంతి పోటీలో తాను ఉండడం.. బాక్సాఫీసు వద్ద రెండు మూడు సినిమాలు పోటీ పడడం అనేది పండగ సీజన్ లో ఇబ్బంది లేని పని అని క్లారిటీ ఇచ్చేశాడు రామ్ చరణ్. మరి ఎన్టీఆర్ బయోపిక్ మీదున్న అంచనాలు రామ్ చరణ్ వినయ విధేయ రామ మీద కూడా ఉన్నాయి. అందుకే రామ్ చరణ్ కూడా తన సినిమా విజయంపై ఎంతో కాన్ఫిడెంట్ గా కనబడుతున్నాడు.