Advertisementt

‘వినయ విధేయ రామ’.. క్రేజ్ ఏది?

Mon 07th Jan 2019 01:02 PM
vinaya vidheya rama,ram charan,ram charan,boyapatri srinu,vvr,overseas,audience  ‘వినయ విధేయ రామ’.. క్రేజ్ ఏది?
No Craze on Vinaya Vidheya Rama in Overseas ‘వినయ విధేయ రామ’.. క్రేజ్ ఏది?
Advertisement
Ads by CJ

తెలుగు సినిమాలకే కాదు.. ఏ భాషా చిత్రాలకైనా ఓవర్సీస్ మార్కెట్ చాలా ముఖ్యమైనది. ఇక తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక్కడ బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలు ఓవర్సీస్‌లో ఓవర్ గా కలెక్షన్స్ కొల్లగొడతాయి. ఇక బాహుబలి ఓవర్సీస్ లో సెట్ చేసిన ఫిగర్ ని టచ్ చెయ్యడానికి చాలా బాలీవుడ్ మూవీస్ పోటీపడ్డాయి. కానీ బాలీవుడ్ మూవీస్ ఏమి ఓవర్సీస్ కలెక్షన్స్ బాహుబలి రేంజ్ లో కొల్లగొట్టలేకపోయాయి. ఇక ఓవర్సీస్ లో క్రేజీ కాంబోలో తెరకెక్కే సినిమాలకు బోలెడంత మార్కెట్ ఉంటుంది. అందులోను త్రివిక్రమ్ సినిమాలన్నా.. సుకుమార్ సినిమాలన్నా ఓవర్సీస్ ప్రేక్షకులకు భలే ఇష్టం. ఇక ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలనైతే ఓవర్సీస్ ప్రేక్షకులు దేవుళ్ళ మాదిరి ఆదరిస్తారు. 

తాజాగా బాక్సాఫీసు వద్ద పోటీ పడుతున్న చిత్రాల్లో ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ, పేట, ఎఫ్ టు చిత్రాలు ఓవర్సీస్ లోను భారీగా పోటీ పడుతున్నాయి. ఇక క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు కి ఓవర్సీస్ లో భారీ క్రేజుంది. అలాగే కామెడీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిస్తున్న ఎఫ్ టు కి కూడా  ఓవర్సీస్ ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు. కాకపోతే రామ్ చరణ్ - బోయపాటిల వినయ విధేయ రామకి ఓవర్సీస్ లో ఓ అన్నంత క్రేజ్ అయితే కనబడటం లేదు.

ఎన్టీఆర్ ప్రీమియర్స్ కి వచ్చే స్పందన వినయ విధేయ రామకి ఉండకపోవచ్చని... రామ్ చరణ్ ని పక్కా మాస్‌గా కనిపించడమే కాదు.. బోయపాటి సినిమాలంటే ఓవర్సీస్ ప్రేక్షకులకు అంతగా ఆసక్తి ఉండదు కాబట్టే ఇది జరుగుతుందని అంటున్నారు. ఎందుకంటే బోయపాటి సినిమాల్లో మాస్ మాస్ అంటూ హీరోలు ఎక్కువగా యాక్షన్ కే పరిమితమవుతుంటారు. తాజాగా వినయ విధేయ రామ కూడా యాక్షన్ ఎంటెర్టైనెర్ గానే తెరకెక్కడంతో.. వినయ విధేయ రామ మీద ఓవర్సీస్ ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలగడం లేదనే టాక్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. 

కాకపోతే రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ మార్కెట్ ఓవర్సీస్ లో భారీగా పెరిగింది. కానీ బోయపాటి వలన ఇపుడు వినయ విధేయ రామకి ఓవర్సీస్‌లో అనుకున్నంత క్రేజ్ రావడం లేదనేది ఇక్కడి ప్రేక్షకుల మాట. ఇది మెగాభిమానులు కూడా అంగీకరిస్తున్నారు. వెంటనే ‘తందానే తందానే’ ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేస్తే.. వస్తున్న వార్తలకు కాస్తైనా పుల్‌స్టాప్ పడే అవకాశం ఉంది.

No Craze on Vinaya Vidheya Rama in Overseas:

What about Vinaya Vidheya Rama Status In Overseas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ