Advertisementt

తేజ ఎందుకు తప్పుకున్నాడో చెప్పేసిన బాలయ్య

Mon 07th Jan 2019 09:04 AM
balakrishna,ntr biopic,teja,krishn,balakrishna about teja,ntr kathanayakudu movie  తేజ ఎందుకు తప్పుకున్నాడో చెప్పేసిన బాలయ్య
Balakrishna NTR Biopic Interview Updates తేజ ఎందుకు తప్పుకున్నాడో చెప్పేసిన బాలయ్య
Advertisement
Ads by CJ

అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ బయోపిక్‌ని నందమూరి బాలకృష్ణ.. తేజ దర్శకత్వంలో మొదలు పెట్టాడు. అలాగే మొదటి షెడ్యూల్‌లో తేజ దర్శకత్వంలో కొన్ని రోజులు షూటింగ్ జరిగాక... అనుకోకుండా తేజ బయటికెళ్లిపోయాడు. అయితే తేజ బయటికెళ్ళాక అనేక అనుమానాలు ఎన్టీఆర్ బయోపిక్‌ని చుట్టుముట్టాయి. ఇక తేజ వెళ్లిపోవడం.. ఆ తర్వాత క్రిష్ మళ్ళీ ఎన్టీఆర్ బయోపిక్ ని హ్యాండిల్ చెయ్యడం చకాచకా జరిగిపోయాయి. అయితే అప్పట్లో తేజ బయటికెళ్ళడం, క్రిష్ రావడంతో అనేకరకాల ఊహాగానాలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. బాలయ్య దెబ్బకి తేజ భయపడ్డాడని... బాలకృష్ణతో ఎన్టీఆర్ బయోపిక్ చెయ్యలేక తేజ చేతులెత్తేశాడని అన్నారు. తర్వాత దర్శకుడు క్రిష్.. ఎన్టీఆర్ బయోపిక్‌ని చాలా చక్కగా అంటే ఎప్పటికప్పుడు సినిమా విశిష్టతను తెలిపేలా తెరకెక్కించాడు. 

తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు విడుదల సందర్భంగా మీడియా ఇంటర్వూస్ లో పాల్గొంటున్న బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ నుండి తేజ బయటికెళ్లడానికి.. ఆ ప్లేస్ లోకి క్రిష్ రావడానికి గల కారణాలు చెప్పేసాడు. ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత తేజ ఈ బరువును తాను మేయలేనని చాలా సతమతమవడంతో... తేజ దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నాడని.. ఆ విషయాన్నీ ఎన్టీఆర్ బయోపిక్‌లో బసవతారకం పాత్ర చేస్తున్న విద్యాబాలన్‌కి కథ చెప్పడానికి ముంబై వెళ్ళామని చెప్పిన బాలకృష్ణ.. ముంబై లో మణికర్ణిక షూటింగ్ లో ఉన్న క్రిష్ తనని కలవడానికి అక్కడకి వచ్చాడని చెప్పాడు.

ఆ టైం లో ఎన్టీఆర్ బయోపిక్ నుండి తేజ తప్పుకున్నాడని తెలిసి... క్రిష్ తనకు తానుగా బాబు నేను ఎన్టీఆర్ బయోపిక్ ని డైరెక్ట్ చేయనా.. అని అడగడంతో రెండే రెండు నిమిషాల్లో ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడిగా క్రిష్ ని ఎంపిక చేశామని చెబుతున్నాడు బాలయ్య. ఇక తేజ చేయనని చెప్పగానే ఎన్టీఆర్ బయోపిక్ డైరెక్షన్ బాధ్యతలు తానే తీసుకుందామనుకున్నానని.. కానీ క్రిష్ అలా అడగడం..  క్రిష్ కి తెలుగు సాహిత్యం బాగా తెలుసునని... బయోగ్రఫీలు ఎన్నో చదివిన అనుభవం ఉండబట్టి ఎన్టీఆర్ బయోపిక్ కి న్యాయం చేయగలడనిపించి క్రిష్ కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించడం జరిగిందని.. బాలయ్య చెప్పాడు.

Balakrishna NTR Biopic Interview Updates :

That’s why Teja Out From NTR Biopic.. says Balakrishna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ