విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ క్రేజీయస్ట్ హీరోల సరసన చేరిన యంగ్ హీరో. చేసినవి తక్కువ సినిమాలే అయినా... విజయ్‌కి బోలెడంత క్రేజ్ వచ్చేసింది. అలాంటి హీరోతో ఒకప్పటి స్టార్.. ప్రస్తుతం ప్లాప్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాధ్ ఒక సినిమా చేయాలనుకున్నాడు. అందులో భాగంగానే పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండకి కథ వినిపించడానికి కాకినాడ కూడా వెళ్లినట్లుగా వార్తలొచ్చాయి. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ డేట్స్ ఖాళీ లేక మరో హీరో రామ్‌తో పూరి ఒక సినిమాని మొదలెట్టేసాడు. విజయ్ కన్నా ముందే రామ్‌ని పూరి లైన్‌లో పెట్టాడు.
అయితే ప్రస్తుతం రామ్ కూడా ప్లాప్స్‌లో ఉండడంతో.. విజయ్ దేవరకొండ దొరికితే సినిమా చేద్దామనుకున్నాడు పూరి. కానీ విజయ్ ఖాళీ లేక రామ్ తోనే సినిమా మొదలు పెట్టేసాడు. తాజాగా రామ్ - పూరి కాంబో టైటిల్ ఎనౌన్స్‌మెంట్ కూడా జరిగింది. రామ్ హీరోగా పూరి దర్శకత్వంలో, నిర్మాణంలో తెరకెక్కబోతున్న సినిమా పేరు ఇస్మార్ట్ శంకర్. అయితే ఈ సినిమా కథను.. ముందు విజయ్ దేవరకొండకి పూరి వినిపించాడని... విజయ్ ఖాళీ లేదని చెప్పడంతో చేసేది లేక అదే కథతో రామ్‌తో ఈ ఇస్మార్ట్ శంకర్ సినిమాని స్టార్ట్ చేస్తున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది.
డియర్ కామ్రేడ్‌తో కాస్త బిజీగా ఉన్న విజయ్ ఖాళీ లేకపోవడంతో... విజయ్ ఫ్రీ అయ్యేవరకు ఆగలేని పూరి జగన్నాధ్... హీరో రామ్‌తో ఈ సినిమా మొదలెట్టేస్తున్నాడట. అయితే ప్రస్తుతం రామ్‌కి మార్కెట్ పడిపోయింది. ఇక పూరికి దర్శకుడిగా అస్సలు మార్కెట్ లేదు. మరి ఇలాంటి టైం లో ఇస్మార్ట్ శంకర్ కి ఏ మేర బిజినెస్ జరుగుతుందో.. అలాగే ఈ కాంబో మీద ఎలాంటి అంచనాలు ట్రేడ్ లోనూ, ప్రేక్షకుల్లోనూ క్రియేట్ అవుతాయో అనేది ప్రస్తుతం అందరి ముందు ఉన్న ఆసక్తికరమైన ప్రశ్న.