Advertisementt

నాగబాబు మాములుగా కెలకడం లేదుగా?

Sun 06th Jan 2019 05:28 PM
balakrishna,nagababu,fight,janasena,war,mega fans,nandamuri fans  నాగబాబు మాములుగా కెలకడం లేదుగా?
Balakrishna vs Nagababu నాగబాబు మాములుగా కెలకడం లేదుగా?
Advertisement
Ads by CJ

బాలకృష్ణ మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న నాగబాబు... మొన్నామధ్యన బాలకృష్ణ తనకు ఎవరో తెలియదని చెప్పడం... అలాగే రెండు రోజుల క్రితం మరోసారి బాలకృష్ణని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు నాగబాబు. దానితో బాలకృష్ణ ఫ్యాన్స్ నాగబాబు మీద ఫైర్ అవుతున్నారు. 

తాజాగా అంటే నిన్న శుక్రవారం  సోషల్ మీడియాలో నాగబాబు పోస్ట్ చేసిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. క‌ట్టు క‌థ‌లు కొన్ని.. క‌ల్ప‌న‌లు ఇంకొన్ని.. చుట్ట‌నేల మూట గ‌ట్ట‌నేల‌.. నిజం క‌క్క‌లేని బ‌యోపిక్కులొద్ద‌మ్మా విశ్వదాభిరామ‌.. విన‌రామామా అంటూ బాలకృష్ణ ని సెటైరికల్ గా రెచ్చగొట్టాడు. ఇక అది చూసిన బాలయ్య ఫ్యాన్స్ ఇది ఖచ్చితంగా బాల‌య్య‌ని టార్గెట్ చేస్తూ చేసిందే అంటూ నాగబాబుపై మండిపడుతున్నారు.

ఇక కొంతమంది సినిమా పెద్దలు కూడా నాగబాబు - బాలకృష్ణల మధ్యన జరిగే వార్‌కు ఫుల్ స్టాప్ పెడితే బావుండుననే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కనిపించిన నందమూరి - మెగా అభిమానుల వార్ ఇప్పుడు ఛానల్స్ ప్రసారం చేస్తున్న డిబేట్స్ లోకి ఎక్కాయి. బాలయ్య వీరాభిమానులతో పాటుగా మెగాభిమానులు కూడా ఛానల్స్ కెక్కి రచ్చ మొదలెట్టారు. 

అయితే ఇదంతా చూస్తున్న మెగా ఫ్యాన్స్ కూడా నాగబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదనడం గమనార్హం. నాగబాబు జనసేనలోకి వెళ్ళడానికే బాలయ్యని టార్గెట్ చేస్తూ పవన్ మెప్పు పొందడానికి ట్రై చేస్తున్నట్లుగా మెగా ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. మరి మెగా ఫ్యాన్స్ కూడా నాగబాబు ఇక నుండి ఇలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 

అయితే ఈ విషయంలో బాలయ్య కూడా ఓ మెట్టు దిగాల్సి ఉంది. టీడీపీ అధికారంలోకి రావడానికి పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ పవన్ పాత్ర ఉందనడంలో సందేహమే లేదు. అలాగే నటుడిగా కూడా పవన్ కల్యాణ్ సుస్వాగతం సినిమా ఓపెనింగ్‌లో బాలయ్య.. పవన్‌కు అభినందనలు తెలిపాడు. అలాంటి పవన్ ఎవరో తెలియదని బాలయ్య చెప్పడం నిజంగా మెగాభిమానులకు మండే విషయమే. కాకపోతే నాగబాబు స్పందించిన సందర్భమే కరెక్ట్ కాదు అనేది మెగాభిమానుల అభిప్రాయం. 

Balakrishna vs Nagababu:

Interesting Between Nagababu and Balakrishna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ