Advertisementt

‘యన్.టి.ఆర్’లో బాలయ్య కూడా లేడు..!!

Sun 06th Jan 2019 01:19 AM
kalyan ram,balakrishna role,ntr biopic,balakrishna  ‘యన్.టి.ఆర్’లో బాలయ్య కూడా లేడు..!!
No Balayya Role in NTR Biopic ‘యన్.టి.ఆర్’లో బాలయ్య కూడా లేడు..!!
Advertisement
Ads by CJ

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ తన తండ్రి బయోపిక్ ని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా కథానాయకుడు, మహానాయకుడు గా తెరకెక్కించాడు. అందులోని కథానాయకుడు వచ్చే బుధవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కథానాయకుడు సినిమా మొత్తం నందమూరి తారకరామారావు నట జీవితానికి సంబంధించినది. అలాగే మహానాయకుడు రాజకీయ జీవితానికి సంబంధించిన సినిమా. అయితే ఎన్టీఆర్ జీవితంలో తన వ్యక్తిగత జీవితం దగ్గరనుండి ఆయన రాజకీయ అరంగేట్రం, సినిమాల్లోకి రావడం ఇలా అన్ని విషయాలను దర్శకుడు క్రిష్ ఈ ఎన్టీఆర్ బయోపిక్ లో చూపించబోతున్నాడు.

అయితే ఎన్టీఆర్ కొడుకుల పాత్రలను వారి కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు పోషిస్తున్నారు. అందులో ముఖ్యంగా హరికృష్ణ పాత్రని కళ్యాణ్ రామ్ పోషిస్తుండగా.. బాలకృష్ణ పాత్రధారుడు ఎవరో అనేది ఇంతవరకు సమాధానం దొరకని ప్రశ్నగానే ఉంది. బాలకృష్ణ స్వయంగా తన తండ్రి ఎన్టీఆర్ పాత్రని పోషిస్తుండగా..... బాలయ్య పాత్ర ఎవరు పోషిస్తారో అనే ప్రశ్న అందరిని తొలిచేస్తోంది. అయితే మొదట్లో బాలయ్య పాత్ర అయన కుమారుడు మోక్షజ్ఞ వేస్తాడని అన్నారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య పాత్రపై కళ్యాణ్ రామ్ ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బయటపెట్టేసాడు.

అదేమంటే ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ గారి పాత్ర లేదని.. అయినా బాలయ్య పాత్ర కనబడదనే ఫీలింగ్ రాకుండా దర్శకుడు క్రిష్ ఈ సినిమాని తెరకెక్కించాడని చెబుతున్నాడు. అసలు కథకు ఏం కావాలో అదే చూపించి... దాన్నే చిత్రీకరించారని చెప్పాడు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ చెప్పినదాన్ని బట్టి బాలయ్య పాత్ర ఉండదు. అసలు చిన్నప్పటి బాలయ్య పాత్రని ఆయన మనవడు చేసాడని బాలయ్య చెప్పాడు కానీ.. యుక్త వయసు బాలయ్య ఎవరనేది బాలయ్య కూడా చెప్పలేదు. ఇక కళ్యాణ్ రామ్ చెప్పినదాన్ని బట్టి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ లో లేనట్లే.

No Balayya Role in NTR Biopic:

Kalyan Ram Clarity on Balakrishna Role in NTR 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ