Advertisementt

‘సైరా’ను బీట్ చేసిన ‘యన్.టి.ఆర్’

Fri 04th Jan 2019 10:56 PM
ntr biopic,sye raa,ntr kathanayakudu,sye raa narasimha reddy,ntr,digital rights  ‘సైరా’ను బీట్ చేసిన ‘యన్.టి.ఆర్’
NTR Kathanayakudu beats Sye Raa ‘సైరా’ను బీట్ చేసిన ‘యన్.టి.ఆర్’
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రూపొందిన భారీ చిత్రం ‘ఎన్టీఆర్’ బయోపిక్. ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తున్న ఈసినిమా రెండు భాగాలుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మొదటి భాగం ‘కథానాయకుడు’ జనవరి 9న.. రెండో భాగం ‘మహానాయకుడు’ ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతున్నాయి. ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేశాడు. తాజా సమాచారం ప్రకారం ‘కథానాయకుడు’ డిజిటల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడు పోయాయని తెలుస్తుంది.

ప్రముఖ డిజిటల్ ఛానల్ ‘కథానాయకుడు’ను రూ. 25 కోట్లకు కైవసం చేసుకుందట. మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ నరసింహా రెడ్డి కన్నా ఎక్కువగా అమ్ముడు పోవడం విశేషం. ‘సైరా’ చిత్రం హక్కులు రూ. 20 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇంకా రెండో భాగం ‘మహానాయకుడు’ డిజిటల్ రైట్స్ అమ్ముడు పోవాల్సిఉంది. 

అలానే థియేట్రికల్ రైట్స్ కూడా ఈ సినిమాకు కాసుల వర్షం కురిపిస్తోంది. వరల్డ్ వైడ్ గా రూ.72 కోట్లకి థియేట్రికల్ రైట్స్ అమ్ముడయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ డిజిటల్ రైట్స్ తో కలిపి 100 కోట్లుకు చేరువైంది. ఈ లెక్కన చూసుకుంటే ‘ఎన్టీఆర్’ బయోపిక్ రెండు భాగాల కోసం పెట్టిన బడ్జెట్‌లో అప్పుడే చాలావరకు వచ్చేసినట్టే. అలా ఈ సినిమాకు అన్ని విధాలుగా కలిసొస్తుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈసినిమాకు బాలకృష్ణ కూడా వన్ అఫ్ ది ప్రొడ్యూసర్. మొదటి భాగంకే ఇంతలా క్రేజ్ ఉంటే.. ఇంక రెండో భాగం పరిస్థితి ఏంటో వేరే చెప్పనవసరం లేదు.

NTR Kathanayakudu beats Sye Raa:

25 crores Digital Rights to NTR Biopic

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ