Advertisementt

‘పేట’ కోసం పాట్లు పడుతున్నారు..!!

Fri 04th Jan 2019 05:34 PM
rajinikanth,petta movie,theaters,problem  ‘పేట’ కోసం పాట్లు పడుతున్నారు..!!
Doubts on Petta Movie Release ‘పేట’ కోసం పాట్లు పడుతున్నారు..!!
Advertisement
Ads by CJ

రజినీకాంత్‌కు కెరీర్ పరంగా మార్కెట్ తగ్గుతుంది..సినిమాల సక్సెస్ రేట్ కూడా తగ్గుతుంది. రజినికి ఈ మధ్య ఎందుకో అసలు కలిసి రావడం లేదు. శంకర్ లాంటి డైరెక్టర్ రజినీని పెట్టి 500 కోట్ల బడ్జెట్ తో 2.0 తీస్తే తెలుగులో దానికి అరవై కోట్లు కూడా రాలేదు అంటే ఆయన మార్కెట్ ఎంతలా పడిపోయిందో ఆలోచించవచ్చు. ‘కబాలి’ విషయంలో కూడా ఇదే జరిగింది.

దీంతో ఆయన తాజా చిత్రం ‘పేట’కి అడిగిన రేటు ఇవ్వడానికి ఎవరూ సాహసించలేదు. సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి ఈసినిమాను తీసుకుని తెలుగులో రిలీజ్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ ‘నవాబ్’ చిత్రంను తెలుగులో తీసుకున్న అశోక్ వల్లభనేని ఈ ‘పేట’ని కూడా తీసుకున్నాడు. అది కూడా ఇరవై ఒక్క కోట్లకి కొన్నట్టు ప్రచారం జరుగుతుంది.

ఇది కేవలం రజిని మార్కెట్ తెలుగులో పడిపోలేదనే భావన నిలబెట్టడానికి, అలాగే బయ్యర్లు తక్కువ ఆఫర్‌ చేయకుండా చూసుకోవడానికి ఇలా చేస్తున్నారని ట్రేడ్‌ టాక్‌. తీసుకోడానికి అయితే తీసుకున్నారు కానీ మరి సంక్రాంతి సీజన్ కి ఈసినిమాకి థియేటర్స్ దొరుకుతాయా అనేది చూడాలి. పైగా మూడు పెద్ద సినిమాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి టాక్ ఏ మాత్రం తేడా కొట్టిన పెట్టుబడిలో సగం కూడా రావటం కష్టమే. తెలుగులో ఈ సినిమా ‘పేట’ అనే పేరుతో రిలీజ్ అవుతోంది.

Doubts on Petta Movie Release:

Theaters Problem to Rajinikanth Petta Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ