ప్రస్తుతం స్టార్ హీరోలు కూడా బాలీవుడ్ తరహాలో బుల్లితెరపై కనిపించేందుకు బాగా ఆరాటపడుతున్నారు. బుల్లితెరపై కనిపిస్తే ఇంటిల్లిపాదికి దగ్గర కావచ్చనేది నిజం. దాని వల్ల వారు మరింత మందికి, సినిమా థియేటర్లకు రావడం మానివేసిన వారికి కూడా దగ్గరవుతారు. ఇక తెలుగులో ఈ ట్రెండ్‌కి తెర తీసింది.. స్టార్ హీరో నాగార్జున. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ద్వారా ఆయన బాగా ఆకట్టుకున్నాడు. దాంతో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సెకండ్ సీజన్‌కి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఓకే చెప్పాడు. కానీ ఈయన పెద్దగా రంజింపలేకపోయాడు. కొంతకాలం పాటు టిఆర్పీ రేటింగ్స్‌ని చూసి పరీక్షల సీజన్ అని వాదించి వారు కూడా ఆ తర్వాత చిరు తన వాక్చాతుర్యంతో అలరించలేకపోయాడని ఒప్పుకున్నారు.
ఇక ఆ తర్వాత వంతు యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌ది. ఆయన కూడా స్టార్ మా ప్రారంభించిన ‘బిగ్‌బాస్’ సీజన్1ని అద్భుతంగా మెప్పించాడు. రెండో సీజన్‌కి వచ్చేసరికి న్యాచురల్ స్టార్ నాని వంతు వచ్చింది. ఆయనపై విమర్శలు ఏ స్థాయిలో వచ్చాయో.. ప్రశంసలు అలాగే వచ్చాయి. ఇక జెమిని టీవీలో నెంబర్‌వన్ యారీ అంటూ దగ్గుబాటి రానా వచ్చి అలరించాడు. ఇక బిగ్‌బాస్ విషయానికి వస్తే పూర్తి ఆధునిక యుగానికి, పాశ్చాత్య సంస్కృతికి అద్దం పట్టే బిగ్‌బాస్‌పై తెలుగులో ఎన్నో విమర్శలున్నాయి. ఇక ఈ ఏడాది జూన్ నుంచి మూడో సీజన్ ప్రారంభం కానుంది. యంగ్ సెన్సేషనల్ స్టార్ విజయ్‌దేవరకొండ అయితే బాగుంటుందని వార్తలు వచ్చాయి.
ఎట్టకేలకు మూడో సీజన్‌కి నాగార్జున, చిరంజీవిలతో పాటు సీనియర్ స్టార్స్‌లో ఒకరైన వెంకటేష్ వస్తాడని అంటున్నారు. వెంకటేష్ అంటే అజాత శత్రువు. ఏ హీరో అభిమాని అయినా వెంకీని అభిమానిస్తాడు. ఫ్యామిలీ ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా లేడీస్‌లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అది వెంకీని పెట్టుకోవడం వల్ల కలిగే లాభం. అయితే వెంకటేష్ సినిమాల విషయం పక్కనపెడితే ఆడియో వేడుకలు, ఇతర ఫంక్షన్స్‌లో వచ్చిరాని తెలుగుతో మాట్లాడుతూ ఉంటాడు.
ఓ వాక్యం మాట్లాడితే అందులో సగం ఆంగ్లపదాలే ఉంటాయి. ఆయన గెటప్, భాష అంతా వచ్చీరాని తెలుగుతో పాశ్చాత్యంగా సాగుతుంది. ఇక బాలయ్యకి తెలుగు, సంస్కృతాలలో పట్టు ఉన్నా ఆయన మైక్ దొరికితే తలా తోక లేకుండా మాట్లాడుతాడు. కాబట్టి వెంకీ, బాలయ్యలకు ఇలాంటివి సరిగా అచ్చిరావనే చెప్పాలి.