భీభత్సమైన సినిమా నేపధ్యం కానీ.. స్టార్ డైరెక్టర్లతో పరిచయాలు కానీ లేకపోయినా.. స్వశక్తితో ఎదిగిన స్టార్ రైటర్ ఆయన. దాదాపుగా అందరు స్టార్ హీరోలతో పనిచేయడం మొదలెట్టిన ఆయన మాటలంటే అందరికీ చాలా ఇష్టం. అందుకే త్రివిక్రమ్ తర్వాత ఆస్థాయిలో నవ మాటల మాంత్రికుడు అని ముద్దుగానూ పిలుచుకుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లోని క్రేజీయస్ట్ మూవీస్ కి వర్క్ చేస్తున్న ఈ రైటర్ ను నమ్ముకొని యువ రచయితలు ఆయన దగ్గర అసిస్టెంట్స్ గా జాయిన్ అయ్యారు. కష్టపడి ఎదిగిన వ్యక్తి కాబట్టి ఆయన దగ్గర పనిచేస్తే తాము కూడా త్వరగానే ఏడుగుతామని భావించారు వాళ్ళందరూ.
అక్కడే దెబ్బ పడింది వాళ్ళకి.. కష్టమెరిగిన ఆ స్టార్ రైటర్ తన అసిస్టెంట్స్ కష్టాన్ని మాత్రం గుర్తించడం లేదు. వాళ్ళచేత అడ్డమైన చాకిరీ చేయించుకోవడమే కాక మందు గ్లాసులు దగ్గరనుంచి ఆమ్లెట్ ప్లేట్స్ వరకూ అన్నీ తెప్పించుకోవడమే కాక కడిగిస్తున్నాడు కూడా. మొదట్లో ఏదో గురుభక్తితో తప్ప చేసిన ఈ యువ రచయితలు రాను రాను తమను కనీసం స్టోరీ డిస్కషన్స్ లో కూడా కూర్చోబెట్టకుండా ఏదో పనివాళ్లలా వాడడాన్ని చూసి నివ్వెరపోతున్నారట. గట్టిగా అడిగితే.. తెలుగు మాటలు రాయాలంటే తెలుగు రావడం ముఖ్యమని చెప్పి రామాయణ, భాగవత మహాగ్రంధాలు బట్టిపట్టమని చెప్పడమే కాక.. గ్రాంధికంలో మాట్లాడమని పిచ్చి పిచ్చి ఆర్డర్లు జారీ చేస్తున్నాడట.
ఆయన స్టార్ రైటరే కావచ్చు.. ఇండస్ట్రీలో ఆయనకి ఇప్పుడు మంచి పేరు ఉండొచ్చు. కానీ.. తనను నమ్ముకుని, తన దగ్గర పని నేర్చుకోవడం కోసం వచ్చిన ఔత్సాహికులను ఇలా నీచంగా చూడడం అనేది ఏమాత్రం హర్షణీయం కాదు. మరి ఆయన రాతలు మాత్రమే కాక పోకడ కూడా అందంగా ఉంటే మంచిది.