Advertisementt

దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు

Wed 02nd Jan 2019 08:23 AM
dil raju,f2,venkatesh,varun tej  దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు
Dil Raju is Very Confident About F2 దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు
Advertisement
Ads by CJ

2017లో ఆరు వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా నిలిచిన దిల్ రాజు.. 2018కి వచ్చేసరికి లక్ కలిసిరాక అటు నిర్మాతగా, ఇటు డిస్ట్రిబ్యూటర్ గా భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. దాంతో ఒక్కసారిగా డల్ అయిపోయాడు. కానీ.. 2019లో మళ్ళీ ఫామ్ లోకి రావాలని బలంగా కోరుకొంటున్నాడు దిల్ రాజు. అందుకే.. తన తాజా చిత్రం ఎఫ్2 ను భారీ పోటీ ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనే సంక్రాంతి బరిలో దింపాలని ఫిక్స్ అయ్యాడు. నిజానికి ఈ చిత్రాన్ని జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయాలనుకున్నాడు దిల్ రాజు. 

కానీ.. తాను ఎక్స్ పెక్ట్ చేసినడానికంటే అద్భుతమైన అవుట్ పుట్ రావడంతో ఇమ్మీడియట్ గా సంక్రాంతి రేస్ లోకి తీసుకొచ్చాడు. 

వెంకీ, వరుణ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా.. తమన్నా, మెహరీన్ లు కథానాయికలుగా నటించారు. పెళ్ళికి ముందు, పెళ్లైన తర్వాత సగటు యువకులు ఎదుర్కొనే సమస్యలు ఈ సినిమాలో చాలా ఫన్నీగా చూపించారట. ఎన్టీఆర్ బయోపిక్, పెట్ట, వినయ విధేయ రామ చిత్రాలు సీరియస్ ఫిలిమ్స్ కావడంతో.. జనాలు తన ఎఫ్2 చూసి ఫుల్ రిలాక్స్ అవుతారని, 2017లో కూడా ఇదే ఫార్మాట్ లో శతమానం భవతితో సూపర్ హిట్ కొట్టానని దిల్ రాజు పిచ్చ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. 

తెలుగు రాష్ట్రాల్లో సగానికిపైగా థియేటర్స్ ఓనర్ అయిన దిల్ రాజుకి థియేటర్స్ సమస్య వచ్చే అవకాశమే లేదు కాబట్టి.. సినిమా ఏమాత్రం బాగున్నా సూపర్ డూపర్ హిట్ కొట్టడం అనేది ఖాయం. మరి దిల్ రాజు కాన్ఫిడెన్స్ ఫలించి ఎఫ్2 సూపర్ హిట్ కొట్టి 2019ను సక్సెస్ తో స్టార్ట్ చేస్తాడో లేదో చూడాలి.

Dil Raju is Very Confident About F2:

Producer Dil Raju is Damn Confident About the Success of F2 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ