గతేడాది విడుదలైన సినిమాల్లో యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా అరవింద సమేత. అప్పటికి ఎన్టీఆర్ ఇంట్లో ఓ విషాదం చోటు చేసుకొని ఉండడంతో సినిమాలోని లోటుపాట్లను పెద్దగా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దాంతో మొదటి మూడునాలుగు రోజులపాటు కలెక్షన్స్ పోటెత్తాయి. సినిమా బిగ్గెస్ట్ హిట్ అయిపోతుందని, నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేస్తుందని భావించారు జనాలు. సినిమా కూడా 50 రోజులపాటు థియేటర్లలో ఆడడంతో డిస్ట్రిబ్యూటర్స్ కి మంచి లాభాలు వచ్చాయనుకొన్నారు.
కానీ.. ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. లాభాలు రావడం పక్కన పెడితే, కనీసం బ్రేకీవెన్ కూడా అవ్వలేదట. అదేంటి.. సినిమాకి వచ్చిన టాక్ కి, కమర్షియల్ రిజల్ట్ కి సంబంధం లేదనుకొంటున్నారా. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఆల్రెడీ ఎన్టీఆర్ కు ట్రేడ్ వర్గాల్లో బ్రేక్ ఈవెన్ స్టార్ అనే పేరుంది. అందుకు కారణం ఎన్టీఆర్ నటించిన సినిమాలు బ్రేకీవెన్ అవ్వవు అని. మంచి మార్కెట్ తోపాటు సక్సెస్ రేట్ కూడా ఉన్న ఎన్టీఆర్ కి ఇలాంటి పేరు రావడం అనేది ఆలోచించదగిన విషయమే కానీ.. ఇటీవల కాలంలో జనతా గ్యారేజ్ తప్ప ఏ ఒక్క సినిమాకి ఎన్టీఆర్ డిస్ట్రిబ్యూటర్ బ్రేకీవెన్ కొట్టలేకపోయాడు. కనీసం అరవింద సమేత అయినా బ్రేకీవెన్ అవుతుందనుకున్నారు. కానీ.. డిస్ట్రిబ్యూటర్స్ అంచనాలు తలక్రిందులయ్యాయి.
ఈ విషయం నిన్నటి 2018 రివైండ్ లో బయటపడింది. ఈ ఏడాది లో హయ్యస్ట్ గ్రాసర్స్ లిస్ట్ వేయగా రంగస్థలం మొదటి రేసులో ఆ తర్వాత గీత గోవిందం నిలవగా.. కనీసం అయిదో స్థానంలో కూడా అరవింద సమేత రాలేదు. దాంతో లెక్కలు వేయగా.. అరవింద సమేత కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిలిగిపోయింది. ఇకనైనా డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోని విధంగా ఎన్టీఆర్ సినిమాలు తెరకెక్కాలని కోరుకొందాం.