పూరీ జగన్నాధ్ ఒక బ్రాండ్. మాస్ సినిమాలు తీయడంలో ఆయన్ను మించినవారు లేరంటే అతిశయోక్తి కాదు. ఏదో ఈమధ్య సరైన హిట్ లేక ఢీలాపడ్డాడు కానీ.. ఒక హిట్ పడిందంటే మాత్రం ఇండస్ట్రీని షేక్ చేయగల ఘనాపాటి మన పూరీ జగన్నాధ్. అలాంటి పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్ టెంపర్ ను బాలీవుడ్ లో రోహిత్ శెట్టి రీమేక్ చేశాడు. తాను తెరకెక్కించే రీమేక్ చిత్రాలను తనదైన శైలి టచ్ ఇచ్చి చాలా మార్పులు చేసే రోహిత్ శెట్టి టెంపర్ విషయంలోనూ అదే ఫార్మాట్ ను ఫాలో అయ్యాడు. కేవలం మూల కథను మాత్రమే తీసుకొని కథనంలో భీభత్సమైన మార్పులు చేశాడు. రణవీర్ సింగ్ పెర్ఫార్మెన్స్, సినిమాలో కామెడీ మరియు పంచ్ డైలాగ్స్ ఇలా అన్నీ బాగున్నప్పటికీ.. టెంపర్ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులకు క్లైమాక్స్ ను కంప్లీట్ గా ఛేంజ్ చేసిన విధానం మాత్రం మింగుడుపడడం లేదు.
నిజానికి టెంపర్ సినిమా ఇంటర్వెల్ బ్లాక్ మరియు క్లైమాక్స్ చాలా కీలకం.. ఆ రెండు చోట్ల ఎన్టీఆర్ నటవిశ్వరూపం చూసే కదా ప్రేక్షకులు ఫిదా అయిపోయింది. అలాంటిది సింబా ఆ మ్యాజిక్ మిస్ అయ్యింది. అయినప్పటికీ.. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో స్పెషల్ ఎంట్రీలు ఇప్పించి ఆడియన్స్ కు బోర్ కొట్టకుండా చేసిన రోహిత్ శెట్టి.. పూరీ మ్యాజిక్ ను మాత్రం రిపీట్ చేయలేకపోయాడు.
ఇదివరకూ సింగం రీమేక్ లో స్వంత తెలివితేటలు వాడి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రోహిత్ శెట్టి.. ఈసారి టెంపర్ విషయంలో వేసుకొన్న లెక్కలు మాత్రం గతితప్పాయి. సింబా చిత్రాన్ని చూసిన తెలుగు ఆడియన్స్ అందరూ టెంపర్ స్థాయ్ ఇంటెన్సిటీని ఈ చిత్రం క్రియేట్ చేయలేకపోయింది అని చెబుతుండడం గమనార్హం. అందుకే అనేది మరీ పూరీ కంటే తోపు ఎవడూ లేడిక్కడ.